టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తోన్న ‘పంచతంత్రం’ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. డా.బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల తదితరులు నటిస్తోన్న యాంథాలజీ ‘పంచతంత్రం’. డిసెంబర్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న విడుదల చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేసింది.
‘పంచతంత్రం’ 5 జంటలకు సంబంధించిన కథ. డా.బ్రహ్మానందం ఈ ఐదు కథలకు పంచేద్రియాలు అనే పేరు పెట్టి తన కోణంలో స్టార్ట్ చేస్తారని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధలు కూడా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని ఎలా స్వీకరించాం. మన పనులను ఎంత బాధ్యతగా పూర్తి చేస్తూ ముందుకెళ్లామనేది కథాంశం. సినిమాలో మనకు కనిపించబోయే ఐదు జంటలకు ఒక్కో కథ .. ఒక్కో రకమైన ప్రయాణం.. అవన్నీ ఎలా ఎండ్ అయ్యాయనే ‘పంచతంత్రం’ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో ముందుకు సాగుతుంది.ప్రతి కథలో మన చుట్టూ ఉన్న సమాజాన్ని అందులో వ్యక్తుల వ్యక్తిత్వాలను దర్శకుడు హర్ష ఎంతో అర్థవంతంగా చూపినట్లు తెలుస్తోంది.
అర్థవంతమైన సంభాషణలు ప్రతి పాత్రలోని భావోద్వేగాలను సెన్సిబుల్‌గా ఎలివేట్ చేస్తున్నాయి.
ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం, నేపథ్య సంగీతం.. రాజ్ కె.నల్లి సినిమాటోగ్రఫీ సన్నివేశాలను, వాటిలోని ఎమోషన్స్‌ను నెక్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి.
సినిమాటోగ్రఫీ : రాజ్ కె.నల్లి, మ్యూజిక్: ప్రశాంత్ ఆర్ విహారి – శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్: గ్యారీ బి.హెచ్, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళ్లి కళంగి, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఉషా రెడ్డి వవ్వేటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భువన్ సాలూరు, లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పదోల్కర్

Here’s #PanchathantramTrailer
https://youtu.be/IL2uYmreTxA
https://youtu.be/IL2uYmreTxA