సినీ దర్శకుడి కథ తో ‘ఘరానా మొగుడు’ ప్రారంభం!

రాజుబాబు దర్శకత్వంలో మోహన్ కృష్ణ ,వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా  యస్.యమ్. కె ఫిలిమ్స్, వి.యన్.ఆర్.ఫిలిమ్స్ నిర్మిస్తున్న ‘ఘరానా మొగుడు’ సినిమా షూటింగ్ హైదరాబాద్ మణికొండ లోని శివాలయంలో ప్రారంభమైనది.  ప్రముఖ దర్శకుడు సాగర్  హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి  గౌరవ దర్శకత్వం వహించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు,జెమిని సురేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏ.ఎస్ రవికుమార్ గారు స్క్రిప్ట్
అందించారు.
దర్శకుడు రాజుబాబు మాట్లాడుతూ… “నాకు చిరంజీవి గారు అంటే ఎనలేని అభిమానం. నేను పలు దర్శకుల దగ్గర పనిచేశాను. ఇది నా మొదటి సినిమా. నేను చూసిన మొదటి సినిమా ఘరానా మొగుడు టైటిల్ కు నేను దర్శకత్వం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక దర్శకుడి సినిమా ,మాస్ ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న సినీ దర్శకుడి కథ” అన్నారు
నిర్మాత, హీరో, మోహన్ కృష్ణ మాట్లాడుతూ… “ఇప్పటివరకు నేను బావ మరదలు, మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ సినిమాలు తీయడం జరిగింది .చిరంజీవిగారు నటించిన ఘరానా మొగుడు టైటిల్ తో చిత్రం తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు.
హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మాట్లాడుతూ… “నా మొదటి సినిమా రెడ్డి గారి ఇంట్లో రౌడీ ఇజం విడుదల కు సిద్ధంగా ఉంది. నా సెకండ్ మూవీ  మా అమ్మగారు నటించిన ఘరానా మొగుడు టైటిల్ లో నేను నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది”అన్నారు.
రావు రమేష్ ,జీవి సుధాకర్ నాయుడు, భానుచందర్, ప్రసన్న కుమార్, సుధ, దేవి, కలర్స్ వాసు,
గీతాసింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  స్టోరీ డైలాగ్స్ : శింగలూరి మోహన్ రావు,డి.ఓ.పి : మురళి మ్యూజిక్ : ఘనశ్యాం , ఎడిటర్ : కె ఎ వై పాపారావు ల్యాబ్ : లైట్ లైన్ స్టూడియోస్.