ఎఎస్‌పి క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకుడి గా వస్తున్న చిత్రం `కన్నుల్లో నీ రూపమే`. నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటించారు. జూన్29న సినిమా విడుదల కానుంది. హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు భిక్షపతి (భిక్ష్) మాట్లాడుతూ -“ఒక ప్రేమకథను హృదయానికి హత్తుకునేలా చెప్పాలనే ప్రయత్నమిది. అమ్మాయి- అబ్బాయి మధ్య ప్రేమకథను తెరపై చూపాను. ‘ఫైనాన్స్, లవ్ ప్రాబ్లెమ్, పేరెంట్ ప్రాబ్లెమ్ ఏం ఉన్నా లైఫ్‌ని రన్ చేయాల’న్న పాయింట్‌ను ఓ లవ్‌స్టోరీ ద్వారా చెప్పాను. రచయితగా ఆసక్తితోనే పని సులువైంది. ఈ సినిమా చేయాలని భావించగానే సంగీత దర్శకుడు పరిచయం అయ్యారు. సాకేత్ కొత్త సంగీత దర్శకుడు అయినా అద్భుత బాణీలిచ్చారు. ఎస్‌పిబి, కార్తీ, రమ్య వంటి టాప్ సింగర్స్ మా చిత్రానికి పాడారు. అనంత శ్రీరామ్ వంటి రచయితలు పాటలు రాశారు. ఎడిటర్ మహేంద్రకు కృతజ్ఞతలు.
మా హీరో నందు ఇటీవలి సినిమాల్లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. తేజశ్రీ నటన బావుంది. తను క్లైమాక్స్‌లో కన్నీళ్లు తెప్పించే నటనచేసింది. పోసాని ఇందులో ఓ విభిన్నమైన పాత్రలో నటించారు. ఆయన సినిమాని రఫ్ ఎడిషన్ చూసి మెచ్చుకున్నారు. ప్రథమార్థం కామెడీ, సెకండాఫ్‌లో గబ్బర్‌సింగ్ బ్యాచ్ కామెడీ అర్థగంట ఆకట్టుకుంటాయి“ అని తెలిపారు. నందు వేరే ప్రాజెక్టులో 2 వారాల పాటు వేరే షెడ్యూల్‌లో బిజీగా ఉండడం వల్ల ప్రచారానికి రాలేకపోయారని తెలిపారు.
తన గురించి చెబుతూ-“నేను దర్శకుడిగా ఎక్కడా పని చేయలేదు. చిన్నప్పటినుంచి కథలు, కవితలు రాసే అలవాటుంది. లండన్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేశాను. పరిశ్రమలో ఎవరూ పరిచయం లేదు. ఏదీ తెలీకుండానే తొలి అడుగు పడింది. మంచి సంగీత దర్శకుడితో కలిసి పని చేశాను. ఫేస్‌బుక్ ద్వారా అందరూ పరిచయమయ్యారు. సంగీత దర్శకుడి ద్వారానే ఇతరత్రా టీమ్‌ని సెలక్ట్ చేసుకున్నాను.. అని తెలిపారు