దేవదాస్… నాగార్జున అక్కినేని, నాని నటిస్తున్న దేవదాస్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక ఫస్ట్ లుక్ కు కూడా అదిరిపోయే ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు నాగార్జున సోలో లుక్ విడుదల చేయబోతున్నారు. ఆగస్ట్ 29 ఆయన పుట్టినరోజు కానుకగా ఈ లుక్ విడుదల చేయనున్నారు. నాగార్జున ఈ చిత్రంలో దేవా పాత్రలో నటిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి బ్యానర్ లో సి అశ్వినీదత్ దేవదాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నటీనటులు:
నాగార్జున అక్కినేని, నాని, రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్, నరేష్ వికే, బాహుబలి ప్రభాకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, సత్య..
సాంకేతిక విభాగం:
దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: అశ్వినీదత్
సంస్థ: వైజయంతి మూవీస్
సినిమాటోగ్రఫర్: శ్యామ్ దత్ సైనూద్దీన్
సంగీతం: మణిశర్మ
ఆర్ట్ డైరెక్టర్: సాహీ సురేష్