“నా డిగ్రీలో ఒక సంవత్సరాన్నైనా చేయాలనుకున్నా. కానీ చేయలేకపోయా. ఆ తర్వాత నేను దూరవిద్య ద్వారా డిగ్రీ చేయాలని ప్రయత్నించా. అయినా కానీ ఆ డిగ్రీ కూడా చేయలేకపోయా”నని వాపోయింది అందాల బీవుడ్ నటి దీపికాపదుకొనే.మోడలింగ్ నుంచి నటిగా మారిన దీపికా కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టాలే పడింది. సీనియర్ నటి హేమమాలిని బయోగ్రఫీ “హేమమాలిని..బియాండ్ ది డ్రీమ్ గర్ల్” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా దీపికా మాట్లాడుతూ…
మోడలింగ్ అసైన్ మెంట్స్ తో బెంగళూరులో 11, 12వ తరగతులను పూర్తి చేయడం కష్టమైందని.. అప్పటికే మోడలింగ్ లో మంచి పేరు తెచ్చుకున్నా.. కాలేజీ విద్యను విరమించుకున్నానని దీపికా చెప్పింది..11,12 వ క్లాస్ లను పూర్తి చేయాలని చాలా కష్టపడ్డా. నేను అప్పటికే చాలా సక్సెస్ ఫుల్ మోడల్. నేనప్పుడు బెంగళూరులో ఉంటున్నా. మోడలింగ్ కోసం నేను ఢిల్లీ నుంచి ముంబైకి ప్రయాణం చేసేదాన్ని. మొత్తానికి ఎలాగోలా 12వ గ్రేడ్ ను పూర్తిచేశా. అలాగే నా డిగ్రీలో ఒక సంవత్సరాన్నైనా చేయాలనుకున్నా. కానీ చేయలేకపోయా. ఆ తర్వాత నేను దూరవిద్య ద్వారా డిగ్రీ చేయాలని ప్రయత్నించా. అయినా కానీ చేయలేకపోయా. అందుకే నేను కేవలం 12వ తరగతి పాస్ అయ్యానని చెప్తున్నా. నా తల్లిదండ్రుల విషయానికొస్తే ఇది పెద్ద సమస్యగా మారింది. నేను కనీసం డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే మోడలింగ్ చేయాలని వారి ఆలోచన అని చెప్పింది. అయితే ఆ తర్వాత దీపికా పదుకొనే నిర్ణయానికి తల్లిదండ్రులు మద్దతు తెలిపారు. దీపికా పదుకొనే ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది.
ముందు మూడు రోజులు వాటికోసమే!
కరోనా కారణంగా స్థంబించిపోయిన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే అన్ లాక్ అవుతోంది. నటీ నటులు షూటింగ్‌లకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో దీపిక పదుకొనే కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేసేందుకు ఓకే చెప్పింది. షకున్ బాత్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు త్వరలోనే గోవాకు వెళ్లనుంది.
అయితే ఆ షూటింగ్‌కు వెళ్లే ముందే మూడు రోజుల పాటు పూర్తి తన ఎండార్స్ చేస్తున్న బ్రాండ్స్‌కు సంబంధించిన షూటింగ్‌లలో పాల్గొననుందట. కరోనా కారణంగా ఈ యాడ్ షూట్‌లను కూడా వాయిదా వేస్తూ వస్తోంది దీపిక. దీంతో వాటిని పూర్తి చేసిన తరువాతే సినిమా షూటింగ్‌లు ప్రారంభించాలని ఫిక్స్ అయ్యింది.అందుకే మూడు రోజులు పక్కగా ప్లాన్ చేసింది. సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తే తిరిగి యాడ్స్ కు టైం ఇచ్చే అవకాశం ఉండదన్న ఉద్దేశంతో.. ముందే ఆ షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తోంది.
దీపిక ఖాతాలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలోనూ కొన్ని బ్రాండ్స్ ప్రమోషన్‌కు ఓకే చెప్పింది దీపిక. లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉన్న సమయాన్ని కూడా చాలా బాగా యుటిలైజ్ చేసుకుంది దీపిక. ఆన్ లైన్ ద్వారా కొన్ని కథలను విని లైన్‌లో పెట్టింది. ఇక సినిమాల విషయానికి వస్తే అమ్మడి ఖాతాలో చాలా సినిమాలే ఉన్నాయి. షకున్ బాత్రా సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా దీపిక నటిస్తోంది.