ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూడలేదు !

“కెరీర్‌ ప్రారంభంలో కెమెరా ముందు నటించాలంటే మొహమాటంగా ఉండేదని పేర్కొంది. అయితే ‘కాక్‌టేల్’‌ సినిమాలో మొదట భయంగా నటించేదానన్ని.. కానీ కొద్ది రోజులు నటించాక.. నటనలో సంతోషాన్ని చూసానని పేర్కొంది. అప్పట్నుంచి నటన పరంగా వెనుదిరిగి చూడలేద”ని దీపిక పదుకొణే చెప్పింది.
జీవితంలో తాను ఎదుర్కొన్న అనుభవాలపై బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణే ఓ టీవీ షోలో పంచుకున్నారు. ” 2012లో విడుదలైన ‘కాక్‌టేల్’‌ సినిమా తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చిందని తెలిపింది.
“దీపిక తన జీవితంలో జరిగిన భావోద్వేగ సంఘటనలను గుర్తుచేసిందని.. ఆమె డిప్రెషన్‌తో బాధపడి, కొద్ది కాలానికే డిప్రెషన్‌ను జయించిందని రణ్‌వీర్‌ ప్రశంసించాడు. మరోవైపు బాలీవుడ్‌లో అత్యంత వేగంగా నటనను మెరుగుపర్చుకున్న దీపిక పదుకొణే ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకుంది.
 
దీపిక సంపాదన రూ.480 కోట్లు !
హీరోలకు దీటుగా రాణించడమే కాకుండా హీరోల స్థాయిలోనే తమ సినిమాల కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూసే స్థాయికి హీరోయిన్లు చేరుకోవడం విశేషం. హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో రాణిస్తున్న అగ్ర కథానాయికల్లో దీపికా పదుకొనె ఒకరు. అత్యధిక సంపాదనను ఆర్జిస్తున్న కథానాయికగా దీపిక నిలిచిందని ‘సీఈవో వరల్డ్‌’ ఓ ప్రకటనలో తెలిపింది. దీపిక మొత్తం సంపాదన 65 మిలియన్‌ డాలర్లు (రూ.480 కోట్లు). అలాగే ఒక్కో సినిమాకి దీపికా కనీసం 14 నుంచి 18 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటుందని ‘సీఈవో వరల్డ్’‌ పేర్కొంది. దీపిక తర్వాత అత్యధిక సంపాదన ఆర్జించిన కథానాయికలుగా ప్రియాంక చోప్రా, కరీనాకపూర్‌, అనుష శర్మ ఉన్నారు. సినిమాల పరంగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తలుగానూ వారు హీరోలను అధిగమించడం మరో విశేషం.
దీపికా ప్రస్తుతం షారూఖ్‌ఖాన్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో ‘సాంకీ’ చిత్రంలో నటిస్తోంది. షారూఖ్‌, దీపికా కలిసి నటించబోయే నాలుగవ చిత్రమిది. ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ తర్వాత ఈ జంట మళ్ళీ వెండితెరపై మ్యాజిక్‌ చేసేందుకు రెడీ అయింది. అలాగే ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే పాన్‌ వరల్డ్‌ చిత్రంలోనూ దీపికా నటిస్తున్న విషయం తెలిసింది.