అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్,సముద్రఖని, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, నటీ నటులుగా ‘సింగం’ సిరీస్ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరి దర్శకత్వంలో సీహెచ్ సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఏనుగు”. శ్రీమతి జగన్మోహని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని త్వరలో విడుదల చేయనున్నారు ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ ను ఘనంగా జరుపుకున్నారు .
హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ… నా కెరీర్లో ఏనుగు బిగ్గెస్ట్ సినిమా తెలుగు తమిళ్ లో ఒకే సారి రిలీజ్ అవుతుంది.హరి సార్ తో వర్క్ చేయడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను. ఇందులో మంచి ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి.సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. గోపీనాథ్ గారు ఎక్సలెంట్ మేకింగ్ ఇచ్చారు.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
దర్శకుడు హరి మాట్లాడుతూ… ఈ ఏనుగు సినిమా కమర్షియల్ ,ఎమోషనల్ యాక్షన్ సినిమా. అందరూ ఫ్యామిలీ తో చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇందులో ప్రస్తుతం సమాజం లో ఉన్న సమస్యలని ఎంటర్టైన్మెంట్ రూపంలో చూపిస్తూ ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది.ఫ్యామిలీ లో ఉన్న ప్రతి ఒక్కరూ సినిమాకు కనెక్ట్ అవుతారు. అన్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… తెలుగు ప్రేక్షకులు ఈఎమోషన్ సినిమాలను బాగా ఇష్టపడతారు. అందుకే “ఏనుగు” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఒక నిర్మాతగా కాకుండా ఒక ఆడియన్ గా తమిళ “యానై” సినిమాను తెలుగులో “ఏనుగు” పేరుతో విడుదల చేస్తున్నాను ఏనుగు ఎంత బలమో ఈ సినిమా లో చూస్తారు ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతూ బయటకు వస్తారని అన్నారు
నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. దర్శకుడు హరి కి ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇద్దరిదీ ఒకటే స్కూల్ అయినా హరి దగ్గర్నుంచి ప్రతి రోజు చాలా విషయాలు నేర్చుకుంటుంటాను. ఏనుగు మంచి ఎమోషనల్ తో ఫుల్ ప్యాక్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుతున్నాను. అన్నారు.
నటి ప్రియ మాట్లాడుతూ… హరి గారి దర్శకత్వంలో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాధికా మేడం, సముద్ర సర్, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ ఇలా సీనియర్స్ తో నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా లో యాక్షన్ ఉంది సెంటిమెంట్, ఎమోషన్,కామెడీ ఇలా ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. దర్శకుడు హరి పాన్ ఇండియా దర్శకుడు. ఏనుగు చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, యోగి బాబు, అమ్ము అభిరామి, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, ఆడుకలం జయపాలన్, ఇమ్మాన్ అన్నాచ్చి, రాజేష్, ఐశ్వర్య, బోస్ వెంకట్, సంజీవ్, పుగజ్ ఇందులో నటీనటులు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు & దర్శకత్వం: హరి, ప్రొడక్షన్ హౌస్: విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్, నిర్మాతలు: సీహెచ్ సతీష్ కుమార్, వేదికకారన్‌పట్టి ఎస్.శక్తివేల్, సంగీతం – జి.వి. ప్రకాష్ కుమార్, DOP – గోపీనాథ్, ఆర్ట్ డైరెక్టర్ – మైఖేల్ B.F.A., ఎడిటర్ – ఆంథోని