కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రధారిగా కొరటాల శివ దర్శకత్వంలో నిర్మిస్తోన్న`ఆచార్య`చిత్రాన్ని మే 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దేశంలో నెలకొన్న కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా సినిమా విడుదలను వాయిదా చేస్తున్నట్లు , పరిస్థితులు చక్కబడగానే సినిమా విడుదల తేదీకి సంబంధించిన ప్రకటనను వెలువరిస్తామని నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ప్రకటించారు. అయితే ఆగస్ట్ లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలున్నారని తెలుస్తోంది.
చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సోనూసూద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
మ్యూజిక్: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణ్ణావుక్కరసు.
‘నీలాంబరి..’ సాంగ్ నెట్ లో… చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నిర్మించడంతో పాటు రామ్‌చరణ్ ఇందులో సిద్ధ అనే పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నాడు. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్ హోల్డ్‌లో పడింది. చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, రామ్‌చరణ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. రీసెంట్‌గానే రామ్‌చరణ్, పూజా హెగ్డేపై కొన్ని సన్నివేశాలతో పాటు ‘నీలాంబరి’ అనే సాంగ్‌ను చిత్రీకరించారు. కాగా.. లీకు వీరులు షాకిచ్చారు. సినిమాలో ‘నీలాంబరి..’ అంటూ సాగే సాంగ్‌ను నెట్ లో లీకు చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట హల్చల్ చేస్తోంది.