‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు టైటిల్‌ను మార్చాలని చిత్రయూనిట్ భావిస్తోందట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి బదులు ‘మహావీర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు భాషల్లోని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండడం కోసం టైటిల్‌ను మార్చాలని నిర్ణయించారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. చిరు జన్మదినం కంటే ముందే స్వాతంత్ర దినోత్సవం రోజే షూటింగ్ ప్రారంభిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అవే నిజమైతే ఇంకో నెల రోజుల్లో చిరు 151వ సినిమా టైటిల్ ఏమిటనే విషయం తెలిస్తుంది.