మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ వెండితెర ఆరంగేట్రం ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు సంస్థ కార్యాలయంలో లాంఛనంగా జరిగింది. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా “ఎవడే సుబ్రమణ్యం” ఫేమ్ మాళవిక నాయర్ నటించనుంది. పూజా కార్యక్రమాలు నేడు (జనవరి 31) తెల్లవారుజామున వారాహి చలనచిత్రం ఆఫీసులో జరిగాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకులు రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, ఎన్వీ ప్రసాద్, గుణ్ణం గంగరాజు, కళ్యాణ్ కోడూరి, అవసరాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా.. ఇండియాస్ టాప్ డైరెక్టర్ రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. “చిరంజీవిగారి అల్లుడైన కళ్యాణ్ దేవ్ పరిచయ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిగారు, రాజమౌళి గారు విచ్చేసి మా చిత్రబృందానికి వారి ఆశీస్సులు అందించడం ఆనందంగా ఉంది. రాకేష్ శశి ప్రిపేర్ చేసిన అద్భుతమైన కాన్సెప్ట్ ను ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్నాం. “బాహుబలి” చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. “రంగస్థలం” చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం” అన్నారు.
తారాగణం:
కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: జాషువా, కళ: రామకృష్ణ, సాహిత్యం: రెహమాన్, సంగీతం: యోగేష్, ఛాయాగ్రహణం: కెకె.సెంథిల్ కుమార్, సమర్పణ: సాయి శివాని, నిర్మాణం: సాయి కొర్రపాటి, నిర్మాత: రజని కొర్రపాటి, కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్ వం: రాకేష్ శశి.
Chiranjeevi Son In Law Kalyaan Dhev’s Debut Film Launched
Mega Star Chiranjeevi’s son-in-law and the most handsome looking Kalyaan Dhev’s debut film is officially launched today. Last few days, industry has been buzzing about Kalyaan Dhev’s entry and none other than Chiranjeevi himself graced the occasion today morning in the wee hours at prestigious production house Vaaraahi Chalana Chitram office to bless Kalyan.
CLAP: CHIRANJEEVI GARU
1ST SHOT DIRECTION: SS RAJAMOULI GARU
CAMERA SWITCH ON: MM KEERAVANI GARU
To be directed by Rakesh Sashii and starring Malavika Nair in female lead, this highly anticipated untitled film will have top technicians and star artists to work for most popular producer Sai Korrapati.
Mega Star himself sounded the clap board, India’s top director SS Rajamouli directed the honorary first shot as MM Keeravani switched the camera on as other guests like MM Keeravani, NV Prasad, Gunnam Gangaraju, Kalyan Koduri, Avasarala Srinivas attended the event to shower their blessings on Kalyan.
“We are very happy and delighted to produce Kalyaan Dhev’s first project on our Vaaraahi Chalana Chitram banner. Our entire team is excited to have Chiranjeevi garu and Rajamouli garu gracing the event to wish us. This Production No 12 will be a very special project with many attractions and a content oriented script prepared by Rakesh Sashii.
Industry’s top technician KK Senthil Kumar of Baahubali fame is cranking the camera while Rama Krishna of Rangasthalam fame is roped as art director. Complete list of artists and technicians is provided. More details regarding the commencement of shooting schedules is all likely to be informed soon,” said Sai Korrapati
Artists:
Kalyaan Dhev, Malavika Nair, Tanikella Bharani, Murali Sharma, Nasser, Sathyam Rajesh, Pragathi, Kalyani Natarajan, Posani Krishna Murali, Rajeev Kanakala, Jaya Prakash (Tamil), Aadarsh Balakrishna, Noel Sean, Kireeti, Bhadram
Chief Technicians List:
Story, Screenplay, Dialogues and Direction: Rakesh Sashii
Producer: Rajini Korrapati
A Sai Korrapati Production, Presenter: Sai Shivani
Cinematography: KK Senthil Kumar, Music Director: Yogesh
Lyrics: Rehman, Art Director: Ramakrishna, Stunts: Joshua