‘అసుర’ చైనా సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కిన ఈ చిత్రం. అత్యంత ‘అట్టర్ ఫ్లాప్’ చిత్రంగా రికార్డు సృష్టించింది.సుమారు రూ.700 కోట్లతో రూపొందిన భారీ చిత్రం. భారీ స్పెషల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో, ఆశలతో అట్టహాసంగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అట్టర్ ఫ్లాపైంది. విడుదలైన నాలుగు రోజులకే థియేటర్ల ముందు ‘ఈ సినిమాను ఇక ప్రదర్శించాలనుకోవడం లేదు’ అంటూ బోర్డులు వెలిశాయి.
చైనాకు చెందిన సినీ నిర్మాణ సంస్థ అలీబాబా పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘అసుర’. టిబెటన్ బుద్దిస్ట్‌ల పౌరాణిక కథల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ‘అసుర’. చైనా చలనచిత్ర పరిశ్రమలోనే ఖరీదైన చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. భారీ స్పెషల్ ఎఫెక్ట్స్‌తో గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇంకా వారం కూడా పూర్తి చేసుకోకుండానే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.వంద మిలియన్ డాలర్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం శనివారం నాటికీ కేవలం 7.3 మిలియన్ డాలర్లు మాత్రమే రాబట్టింది. దాంతో సినిమా అట్టర్ ఫ్లాపైందని భావించి ఆదివారం రాత్రి 10 గంటలకు సినిమాను థియేటర్ నుంచి తీసేశారు.
“ఈ సినిమా చూడాలనుకుంటున్న ప్రేక్షకులకు క్షమాపణలు. ఎందుకంటే ఈ సినిమాను ఇక ప్రదర్శించాలనుకోవడం లేదు” అని పలు థియేటర్ల యజమానులు వెల్లడించారు. ఇప్పటివరకు వచ్చిన చైనా సినిమాలను ‘అసుర’ సినిమా కోసం ఖర్చు చేసిన మొత్తంలోని సగం బడ్జెట్‌తోనే తెరకెక్కించారు.
చైనాలో అతిపెద్ద రివ్యూ ప్లాట్‌ఫాం అయిన ‘డౌబాన్’ ఈ సినిమాకు కేవలం 3.1 రేటింగ్స్ ఇచ్చింది.ప్రపంచంలో అత్యంత అట్టర్ ఫ్లాప్ చిత్రాల్లో ఈ సినిమా 5వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా కారణంగా చిత్రబృందం భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ సినిమాను తెరకెక్కించడానికి ఆరేళ్లు పట్టిందట. హాంగ్‌కాంగ్‌కు చెందిన నటులు టోనీ లోంగ్, కరీనా లౌ,జంగ్ ఇ షాంగ్, మాత్యు నోలెస్,డామేన్ వాల్టర్స్ ఇందులో నటించారు.