ప్రథ ప్రొడక్షన్స్ పతాకంపై భరత్ దర్శకత్వంలో డా.శ్రీధర్ రాజు ఎర్ర, డా.తాళ్ల రవి, డా. టిపిఆర్ తొలిసారిగా నిర్మిస్తోన్న చిత్రం `మేరా భారత్ మహాన్`. అఖిల్ కార్తిక్, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ క్లాప్ నివ్వగా పాటల రచయిత చంద్రబోస్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి మరో ప్రముఖ దర్శకుడు సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత డా.శ్రీధర్ రాజు ఎర్ర మాట్లాడుతూ…“సమకాలీన అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి ఓ సందేశాత్మక చిత్రంగా `మేరా భారత్ మహాన్` చిత్రాన్ని ముగ్గురు మిత్రులం కలిసి నిర్మిస్తున్నాం. గతంలో పలు సామాజిక అంశాలతో కూడిన చిత్రాలకు దర్శకత్వం వహించిన భరత్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు“ అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన డా.తాళ్ల రవి మాట్లాడుతూ…“దేశం బాగుపడాలంటే యువత సంకల్పించాలి. సమాజంలోని సమస్యలను అరికట్టే బాధ్యత వారిదే కాబట్టి నేటి యువతను చైతన్య పరిచే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అలాగే అన్ని వర్గాలకు నచ్చే అంశాలను మా సినిమాలో పొందుపరిచాము“ అన్నారు.
మరో నిర్మాత డా.టిపిఆర్ మాట్లాడుతూ…“సందేశంతో పాటు మా చిత్రంలోని మంచి వినోదం కూడా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిత్రాలు చాలా అవసరం. ముఖ్యంగా యువతకు మంచి సందేశం ఇస్తూ.. లవ్ స్టోరిని కూడా మిక్స్ చేశాం. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం“ అన్నారు.
హీరో అఖిల్ కార్తిక్ మాట్లాడుతూ…“దేశానికి ఉపయోగపడే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు“ అన్నారు.
హీరోయిన్ ప్రియాంకశర్మ మాట్లాడుతూ…“విభిన్నమైన చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఇందులో మంచి సందేశం ఉందన్నారు.
మాటల రచయిత యర్రంశెట్టి సాయి మాట్లాడుతూ…“ ప్రజా సమస్యలపై ఈ చిత్రం వస్తోంది. సమకాలీన అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో కమర్షియల్ హంగులు కూడా మెండుగా ఉంటాయి“ అన్నారు.
దర్శకుడు భరత్ మాట్లాడుతూ…“ సైక్రియాటిస్ట్ అయిన డా.శ్రీధర్ మంచి కథని సిద్ధం చేసుకుని మరో ఇద్దరు మిత్రులతో కలిసి `ప్రథ ప్రొడక్షన్స్` అనే బ్యానర్ ని స్థాపించి ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించాలని ఆలోచిస్తున్న తరుణంలో నా మిత్రుడైన సాంబేష్ వారికి నన్ను పరిచయం చేశారు. ఫస్ట్ సిటింగ్ లోనే వారు నన్ను డైరక్టర్ గా కన్ ఫర్మ్ చేశారు. ఒక భారతీయుడు, అపరిచితుడు, ఠాగూర్ చిత్రాల తరహాలో ఉండే కథ ఇది. నిజంగా దీన్ని డైరక్ట్ చేయడం ఒక ఛాలెంజింగ్ అని చెప్పాలి. మా ముగ్గురు నిర్మాతలు కూడా డాక్టర్లు కావడంతో వారికి సొసైటీ మీద మంచి అవగాహన ఉంది. బ్యానర్ దగ్గర నుంచి టైటిల్, క్యాప్షన్ ఇలా ప్రతి విషయంలో కేర్ తీసుకుంటూ కొత్తగా ఉండేలా ప్రయత్నం చేస్తున్నాం. యర్రంశెట్టి సాయి గారు డైలాగ్స్ అద్భుతంగా రాసారు. ఇందులో ఓ స్టార్ హీరో నటిస్తున్నారు. త్వరలో ఎవరనేది ప్రకటిస్తాం. కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ ఉంటాయి. లవ్ స్టోరీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సామాన్యులకు విద్య , వైద్యం అందుబాటులో ఉండాలి. అప్పుడే సమాజం బాగుంటుందనేది మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం. ఏ ప్రభుత్వానికి వ్యతికేఖంగా మేము సినిమా తీయడం లేదు. సిస్టమ్ లో ఉన్న కొన్ని లోటు పాట్లను ఎత్తి చూపుతూ వాటిని పరిష్కరించమంటున్నాం. కేరళలో రెండు పాటలు చిత్రీకరించి ఆ తర్వాత వరంగల్ లో 25 రోజుల పాటు షూటింగ్ చేస్తాం. మిగిలిన భాగం హైదరాబాద్ లో పూర్తి చేసి ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, సాయిచంద్, ఎల్ బి శ్రీరాం, సన, ప్రగతి, జయప్రకాష్ రెడ్డి, సురేఖావాణి,ఝాన్సీ, అనితా చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టోరిః డా.శ్రీధర్ రాజు ఎర్ర, డైలాగ్స్ః యర్రంశెట్టి సాయి, పాటలుః చంద్రబోస్, పెద్దాడమూర్తి, చిలకరెక్క గణేష్, ఎడిటర్ః మేనగ శ్రీను, ఫైట్స్ః విజయ్, మేకప్ః యాదగిరి, పబ్లిసిటీ డిజైనర్ః రాంబాబు, స్టిల్స్ః వేణు, కాస్ట్యూమ్స్ః వల్లి, పిఆర్వోః రమేష్ బాక్సాఫీస్, ఆర్ట్ః పి.డేవిడ్, సినిమాటోగ్రఫీః ముజీర్ మాలిక్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ః వల్లమాటి వెంకట్ రావు, ప్రొడక్షన్ కంట్రోలర్ః కె.వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరక్టర్ః విజయ్, అసోసియేట్ డైరక్టర్ః కృష్ణ ప్రసాద్, కో-డైరక్టర్ః రాజానంద్, కొరియోగ్రాఫర్స్ః స్వర్ణ, దిలీప్, సంగీతంః లలిత్ సురేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః సోమర్తి సాంబేష్, ప్రొడ్యూసర్స్ః డా.శ్రీధర్ రాజు ఎర్ర, డా.తాళ్ల రవి, డా. టిపిఆర్,స్క్రీన్ ప్లే-దర్శకత్వంః భరత్.