కుటుంబ కధాంశం తో కూడిన హర్రర్ హిట్ చిత్రం క్షుద్ర చిత్రాన్ని అందించిన దర్శకుడు నాగుల్ దర్శకత్వంలో ఎం. నరేంద్ర సమర్పణలో వర్కింగ్ యాంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం బంజారా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రం తెలుగు ,తమిళ్ భాషలో జనవరి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానున్నది .ఇది రొటీన్‌కు భిన్నమైన హర్రర్ కధాంశంతో కూడుకున్న చిత్రమని నిర్మాత కోయ రమేష్ బాబు తెలిపారు .అమృత ,టెంక్వేల్ కపూర్ , తేజేష్ వీర ,హరీష్ గౌలి ,జీన ,జీవ ,బెనర్జీ ,శరత్ ,వేదం నాగయ్య ,అనంత్ ,జ్యోతిశ్రీ ,జబర్దస్త్ రాజు ,అప్పారావు , శాంతిస్వరూప్ ,దొరబాబు మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గంటాడి కృష్ణ , పాటలు: కోయ రమేష్ బాబు ,కెమెరా : ఎ. వెంకట్ ,ఎడిటింగ్: బి .మహేంద్ర , ఆర్ట్:బరంపురం విశ్వప్రసాద్ , నిర్మాతలు : కోయ రమేష్ బాబు , దేవభక్తుని నవీన.
రచన ,దర్శకత్వం : నాగుల్.