నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా కొత్త చిత్రం గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ హిట్ కాంబినేషన్లో `జైసింహా` వంటి సూపర్‌హిట్ తర్వాత రూపొందుతున్న చిత్రమిది.
ఈ కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కోదండ రామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి పరుచూరి మురళి కథను అందిస్తున్నారు.
చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామ్‌లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. చిన్నా ఆర్ట్ వర్క్‌ను అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి
సమర్పణ: సి.కె.ఎంటర్టైన్మెంట్స్
బ్యానర్: హ్యాపీ మూవీస్
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
కథ: పరుచూరి మురళి,సంగీతం: చిరంతన్ భట్, సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్
ఆర్ట్: చిన్నా,డైలాగ్స్: రత్నం,ఫైట్స్: రామ్‌లక్ష్మణ్
నిర్మాత: సి.కల్యాణ్,కో ప్రొడ్యూసర్: సి.వి.రావ్