నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. `సింహా`, `లెజెండ్` వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా రూపొందనుంది. నందమూరి బాలకృష్ణ కోసం దర్శకుడు బోయపాటి శ్రీను మరో పవర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేశారు.
కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రస్తుతం సమాజంలోని ప్రధానమైన సమస్య తో బోయపాటి శ్రీను అద్భుతమైన కథను సిద్ధం చేశారు. డిసెంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2020 వేసవి చివరలో సినిమాను విడుదల చేస్తారు.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో బాలకృష్ణ పవర్‌ఫుల్ లుక్స్ అందరినీ మెప్పించాయి. అలాంటి మరో పవర్‌ఫుల్ లుక్‌లో బాలకృష్ణ చూపించనున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్యాషనేట్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.3గా నిర్మించనున్నారు.
Balakrishna- Boyapati Sreenu combination
Balakrishna, Boyapati Sreenu, producer Miryala Ravinder Reddy, Dwaraka Creations Production No 3 Film Announcement Balakrishna and director Boyapati Sreenu is the most craziest combination. they are going to teamup for the third time.
‘Simha’ and ‘Legend’ were the earlier films in their combination and both were huge blockbusters. For the third film, director Boyapati has prepared yet another powerful story. ‘Simha’ and ‘Legend’ have plot-lines that deal with issues in the society .Also in the first two films, Balakrishna’s looks were major highlight and for this third film he will yet again sport a new look.
regular shooting will kick-start from December and plans to release by 2020 summer ending. Miryala Ravinder Reddy who is a passionate producer and is known for big budget films..producing the movie under Dwaraka Creations banner.