దర్శకుడు రాజమౌళి పారితోషికం ఎంత వుంటుందనేది ప్రశ్న ఆసక్తిగా మారింది. ఆయన మొదటినుంచి పర్సెంటేజీ సిస్టమ్‌తోనే సినిమా చేస్తారనేది తెలిసిందే. అయితే బాహుబలికి ఎంత తీసుకున్నారనే ఆసక్తి చాలామందిలో వుంది. దానికి ఇటీవలే ఆయన తెలియజేస్తూ… నా విషయం చెబితే ఇతర విషయాలూ చెప్పాల్సివస్తుందంటూ దాట వేశారు….
”నేను నా సినిమాలకు సంబంధించి పర్సెంటేజీ తీసుకుంటాను. ఇదేమీ సీక్రెట్ కాదు. ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి రెమ్యూనరేషన్ తక్కువే తీసుకున్నాను. సినిమా హిట్ అయితే పర్సెంటేజీ తీసుకుంటాను. లేకపోతే పోతుంది. ఇది నా రిస్కే కదా. ‘బాహుబలి’ మెగా హిట్టయింది. దీని ఆదాయం వేరు. దీన్నే అన్నింటికీ ప్రామాణికంగా తీసుకోకూడదు. నేను తీసుకునే పర్సెంటేజీ ఎంత అన్నది చెప్పకూడదని కాదు. నా విషయం చెబితే ఇతరుల రెమ్యూనరేషన్లు.. పారితోషికాల గురించి కూడా చెప్పాలి. అది నాకిష్టం ఉండదు. కాబట్టి నా పర్సెంటేజీ ఎంతో చెప్పలేను” అన్నాడు రాజమౌళి.
ఐతే తనతో సినిమా చేయాలనుకునే నిర్మాత భారీ పారితోషికం ఆఫర్ చేస్తే సినిమా చేసేయనని.. ఆయనకు సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంది.. మంచి సినిమా కోసం ఎంత తపిస్తాడనే చూస్తానని రాజమౌళి తేల్చి చెప్పాడు. తనకు ప్రస్తుతం డీవీవీ దానయ్య, కేఎల్ నారాయణలతో కమిట్మెంట్లు ఉన్న సంగతి వాస్తవమే అని చెప్పాడు రాజమౌళి.