మధ్యలో ఏ ఆటంకాలు, సమస్యలు రాకుంటే ఆరు నెలలు చాలు ఒక సినిమా తీయడానికి…భారీ చిత్రమైతే ఏడాది . యన్టీఆర్ ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలు తీయడానికి రెండేళ్లకి పైగా పట్టింది. అవి కలకాలం నిలిచిపోయాయి కూడా. కానీ ఇప్పుడు అంత ఓపికా లేదు, తీరికా లేదు. అయితే ‘బాహుబలి’ మాత్రం అందుకు ఎక్సెప్షన్. దర్శకుడు రాజమౌళి ఆ సినిమాను అద్భుత కళాఖండంగా రూపొందించాడు. ఈ చిత్రం ప్రభాస్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.ఇప్పుడు కొన్ని సినిమాలు మూడు నెలల్లో కూడా తయారవుతున్నాయి. అయితే ఇప్పటి పరిస్థితికి భిన్నంగా ‘బాహుబలి’ రెండు భాగాలకూ నాలుగేళ్లు పట్టింది. ఆ సినిమా హీరో ప్రభాస్ ఆ ఒక్క సినిమాకోసమే అంత సమయం కేటాయించాడు. ఇక పైన సినిమాకైనా అంత సమయం కేటాయిస్తారా? అని అడిగితే ప్రభాస్ చెప్పిన సమాధానం అందరికి షాక్ ఇచ్చిందట….
“ఓ నటుడి కెరీర్లో నాలుగేళ్ల సమయం చాలా విలువైనదని అన్న ప్రభాస్ , ‘బాహుబలి’ కోసం అంతటి సమయాన్ని కేటాయించడానికి కారణం రాజమౌళిపై గల నమ్మకమని చెప్పారు. ఇప్పుడు ఆ స్థాయి ప్రాజెక్టుతో ఎవరైనా వస్తే రెండేళ్ల సమయాన్ని మాత్రం కేటాయించడానికి తాను సిద్ధమనీ, నాలుగేళ్లు పడుతుందంటే మాత్రం కష్టమని ప్రభాస్ నిర్మొహమాటంగా చెప్పినట్లు ఫిలింనగర్ టాక్.