హోం క్వారంటైన్‌ తర్వాతనే ‘అవతార్ 2’ ‌షూటింగ్ !

జేమ్స్‌ కామెరూన్ ‘అవతార్’  ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. దానికి సీక్వెల్ గా ఇప్పుడు నాలుగు సినిమాలు రాబోతున్నాయి. ఇందులో భాగంగా ‘అవతార్ 2′ దాదాపుగా రెడీ అయ్యింది. సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. ఈ సినిమాలోని ఫోటోలను దర్శకుడు జేమ్స్ కామెరాన్ రిలీజ్ చేశారు. పండోర గ్రహంపై అవతార్ మనుషులు ఎలా ఉన్నారో ఫస్ట్ పార్టీలోనే చూశాం. సెకండ్ పార్ట్ లో వీరిని మరింత కొత్తగా చూపుతూ… వీరి సాహసాలను చూపించబోతున్నారు.’అవతార్ 2’ 2021 డిసెంబర్ 17 వ తేదీన తర్రివాతనేలీజ్ కాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను రిలీజ్ చేయడంతో హాలీవుడ్ లో సందడి మొదలైంది. తొలి ‘అవతార్’‌ సినిమా విడుదలైన 12 ఏండ్లకు సీక్వెల్‌ వస్తుండటం విశేషం.
 
‘జెనోజెనెసిస్’‌ 42 ఏండ్ల క్రితం ఈ సినిమాతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కెనడియన్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌, స్క్రీన్‌రైటర్‌ జేమ్స్‌ కామెరూన్‌.. ఇప్పటివరకు 33 సినిమాలు తీశారు. వీటిలో 11 సినిమాలు ఆయన స్వీయ దర్శకత్వంలోనే వెలువడి సంచలనం సృష్టించాయి. 1984 లో ‘ది టర్మినేటర్’‌ సినిమాతో తనకంటూ హాలీవుడ్‌లో ఒక గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత ‘రాంబో’, ‘ఏలియన్స్‌’, ‘టైటానిక్‌’, ‘అవతార్’‌ వంటి ఎన్నో సైన్స్‌ ఫిక్షన్ సినిమాలు జనానికి అందించారు.
 
‘అవతార్‌’ జేమ్స్‌ కామెరూన్‌ నిర్మించిన సినిమాలన్నింటిలో కొత్త ట్రెండ్‌ను సెట్‌ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాకు సీక్వెల్‌ తీస్తానని కామెరూన్‌ అప్పుడే ప్రకటించారు. దానికి తగినంత వర్కవుట్‌ కూడా చేశారు. స్క్రీన్ ‌ప్లే పుస్తకాలను సినిమాలో నటిస్తున్నవారికి, సాంకేతిక నిపుణులకు అందించారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌ ప్రారంభించేందుకు 50 మంది క్రూతో కలిసి ప్రత్యేక చార్టర్డ్‌ విమానంలో జేమ్స్‌ కామెరూన్‌ న్యూజీలాండ్ చేరుకొన్నారు. వెల్లింగ్టన్‌ చేరుకోగానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం జేమ్స్‌ కామెరూన్‌తోపాటు క్రూ అందరూ 14 రోజుల సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారని నిర్మాత జోన్‌ లాండౌ వారి ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసి అవతార్‌ సెట్స్‌ అన్నీ సిద్ధమయ్యాయని చెప్పారు.
 
సినిమా ప్రొడక్షన్‌ పనులు కరోనా మహమ్మారి వ్యాప్తి మధ్య ఎలా చేయాలి? అనే విషయంలో న్యూజీలాండ్‌ ప్రభుత్వం వివరణాత్మక మార్గదర్శకాలతో ముందుకొచ్చింది. ‘అవతార్’‌ సీక్వెల్‌ షూటింగ్‌ ప్రారంభమైతే న్యూజీలాండ్‌ గడ్డ మీద చిత్రీకరణ జరుపుకొంటున్న మొదటి విదేశీ చిత్రంగా నిలువనున్నది. అవతార్‌-2తో సీక్వెల్‌ ప్రయాణాన్ని ముగించకుండా అవతార్‌-3, అవతార్‌-4 సినిమాలు కూడా నిర్మించాలని ఎప్పుడో నిర్ణయించుకొన్నట్టు వెల్లడించారు జేమ్స్‌ కామెరూన్‌.’అవతార్‌-2’ ను 2021 డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నట్టు ఇదివరకే జేమ్స్‌ కామెరూన్‌ ప్రకటించారు.