అథర్వ హీరోగా శుభకరి క్రియేషన్స్ చిత్రం ‘డస్టర్1212’. బద్రీ వెంకటేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మరిపి విద్యాసాగర్ (వినయ్) నిర్మిస్తున్నారు. అనైకాసోటి మిస్తీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… అథర్వా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. అధర్వ మురళీగారబ్బాయి. మురళీ ‘హృదయం’ చిత్రంతో అందరికీ పరిచయమున్నవ్యక్తి. ఈ చిత్రం తెలుగులో వినయ్గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమిళనాడులో మంచి హిట్ అయిందనే టాక్ ఉంది. తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను…అని అన్నారు.
నిర్మాత వినయ్ మాట్లాడుతూ… శుభకరి క్రియేషన్స్ బ్యానర్లో మా రెండో చిత్రం ఇది. తమిళంలో అథర్వా మురళీగారు నటించిన చిత్రం తెలుగులో అందిస్తున్నాము. ఇది ఒక బ్యాచ్ లర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయి కధ. శ్రీకాంత్గారి చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేశాం.ఇందులో హీరో విశాల్ ఫాదర్ జి.కె.రెడ్డి ముఖ్య పాత్ర వహించారు. కరుణాకరన్, మనోబాల కామెడీ చాలా బాగాఉంటుంది.అక్టోబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం ..అని అన్నారు
ఇందులో అథర్వా, అనైకాసోటి మిస్తీ, దేవదర్శిని,జి.కె.రెడ్డి,ఎం.ఎస్. భాస్కర్, మనోబాల, యోగిబాబు, ఆదుకలమ్నరేన్, రంజిత్, కరుణాకరన్, రెమీ కార్తికేయన్ నటీ నటులు.డైలాగ్స్ఃరాజశేఖర్రెడ్డి, మ్యూజిక్ఃయువన్శంకర్రాజా, ఎడిటర్ఃప్రవీణ్కె.ఎల్, సినిమాటోగ్రఫీఃగోపి అమర్నాథ్, డైరెక్టర్ఃబ్రది వెంకటేష్, ప్రొడ్యూసర్: మరిపి విద్యాసాగర్(వినయ్)