రజనీకాంత్ కత్తి,రంభ జంటగా ఎల్.వి. క్రియేటివ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో లెంకల `అశోక్ రెడ్డి` నిర్మిస్తోన్న చిత్రం `అశోక్ రెడ్డి`. అశోక్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాంబాబు.డి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. బిగ్ సీడీని మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కొణిజేటి రోశయ్య, సీడీలను నటి కవిత, థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకుడు బాబ్జీ, నటుడు చిట్టిబాబు ఆవిష్కరించారు.
అనంతరం రోశయ్య మాట్లాడుతూ… ` ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో సినిమాల సక్సెస్ రేట్ తక్కువగా ఉందని విన్నాను. మంచి కథతో సినిమాలు చేస్తే విజయవకాశాలున్నాయి. కొత్తవారంతా కథ, పాత్రల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేయాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. చిన్న సినిమా నిర్మాతలు ఎప్పటి నుంచి ఇండస్ర్టీలో నలిగిపోతున్నారు.
అశోక్ రెడ్డి మాట్లాడుతూ… ` నేను 11వ ఏట నాటకాలు వేయడం మొదలుపెట్టాను. సాఘింకం, పౌరాణికం నాటకాలు రోజు వేసేవాడిని. చదువుకన్నా ఇలాంటి యాక్టివిటీస్ పైనే ఎక్కువగా దృష్టిపెట్టేవాడిని. పరిశ్రమలో కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న నిర్ణయంతో హైదరాబాద్ కు వచ్చాను. మూడేళ్లు ప్రయత్నాలు చేసి కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. సినిమాలపై నాకున్న ఫ్యాషన్ ను ఇప్పుడిలా నిరూపించుకోబోతున్నా. అశోక్ రెడ్డి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. నటి కవిత మాట్లాడుతూ, ` అశోక్ రెడ్డిగారికి సినిమాలంటే చాలా ఫ్యాషన్. ఆయన నిర్మాతగా ఉంటూనే ఓ పాత్ర పోషించారు. తప్పకుండా నటుడిగా సక్సెస్ అవుతారు.
బాబ్జి మాట్లాడుతూ… `గత ఏడాది విడుదలైన `అర్జున్ రెడ్డి` ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. కానీ ఆ ఆర్జున్ రెడ్డి కన్నా అశోక్ రెడ్డి నల్లగొండ జిల్లాలో గతంలో ఎన్నో సంచలనాలు నమోదుచేసారు.
చిత్ర దర్శకుడు నంది వెంకటరెడ్డి మాట్లాడుతూ… `అశోక్ గారికి కథ చెప్పగానే బాగా నచ్చడంతో వెంటనే చేస్తానన్నారు. అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సినిమాలో ఆయన నటించడం మాకు చాలా సంతోషంగా ఉంది. కథలో చక్కని సందేశం కూడా ఉంది. యూత్ కు నచ్చే అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి` అని అన్నారు.
శ్రీనివాస్ కుప్పలి, శ్రీదేవి, సురేష్,సంఘర్ష, నాగేశ్వర్ తన్నీరు, బి.కుమారి, భూపాల్, అంజనేయులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: వెంకట్ సోకళ్ల, రాము, ఛాయాగ్రహణం: యాదగిరి.డి, మాటలు: మహేష్, ఎడిటింగ్: శ్రీశైలం, ఫైట్స్: మధు డైమండ్, స్టోరీ, స్ర్కీన్ ప్లే, డైరెక్షన్: నంది వెంకటరెడ్డి.