అశోక్ గల్లా హీరోగా.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో ఈ చిత్రాన్ని పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ, రామ్‌చరణ్, రానా దగ్గుబాటి, ఆది శేషగిరిరావు, అమల అక్కినేని, నమ్రత శిరోద్కర్, సుశాంత్ ఈచిత్ర ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు.
రామ్‌చరణ్ క్లాప్ ఇవ్వగా.. రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.ముహూర్తపు సన్నివేశానికి సూపర్‌స్టార్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ.. గల్లా జయదేవ్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను సోదరుడిలా ట్రీట్ చేస్తుంటారు. ఆయన అశోక్‌తో తొలి సినిమా చేస్తున్నారు. ‘ఆల్ ది బె వెరీ బెస్ట్’ తెలువుతున్నాను అన్నారు.
దగ్గుబాటి రానా మాట్లాడుతూ.. మంచి కథ, కథనాలతో అశోక్ గల్లా ఇండస్ట్రీలోకి పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది. నిర్మాతగా పద్మగారు లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అందరికి ఆల్ ది బెస్ట్ తెలువుతున్నాను అన్నారు.
గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ.. నా మనవడు అశోక్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్. మానాన్నగారి ఆశీర్వాదం అశోక్‌కి ఉంటుంది. తను ఇండస్ట్రీలోకి రావాలని చాలా బలంగా అనుకుని హార్డ్ వర్క్ చేసి ఎంట్రీ ఇస్తున్నాడు అన్నారు.
పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా మాట్లాడుతూ.. కేవలం సినిమాలే కాదు.. టెలివిజన్ రంగంలోనూ కొత్త కంటెంట్‌ను అందించాలని మేం భావిస్తున్నాం.అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను చాలా రోజుల క్రితమే రిజిష్టర్ చేశాం. అలాగే నా భార్య పద్మావతి సూపర్‌స్టార్ కృష్ణగారి ఫ్యామిలీకి చెందినవారు . కృష్ణ గారు హీరోగానే కాదు.. డైరెక్టర్‌గా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తన మార్కును క్రియేట్ చేశారు. మా ఫ్యామిలీ నుండి అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేస్తున్నాం. శ్రీరామ్ ఆదిత్యగారు డైరెక్ట్ చేసిన గత రెండు చిత్రాలు చాలా బావున్నాయి.ఇది కూడా తప్పకుండా అందరినీ మెప్పించేలా ఉంటుంది. అశోక్ 7వ తరగతి నుండి ఇంటర్ వరకు సింగపూర్‌లో చదివాడు. ఆ సమయంలో తను డ్రామా అనే సబ్జెక్ట్‌ను ఎంచుకుని నేర్చుకున్నాడు. డిగ్రీని కూడా ‘టెక్సాస్ ఫిల్మ్ అండ్ టెలివిజన్’ లోనే చేశాడు. తర్వాత రెండు, మూడు ఏళ్లు హార్డ్ వర్క్ చేసి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అన్నారు.
నిర్మాత పద్మావతి గల్లా మాట్లాడుతూ… అమర్‌రాజా గ్రూప్ మొదలు పెట్టిన అన్ని సంస్థలు గొప్పగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను మొదలు పెట్టాం. ఈ వెంచర్ కూడా మిగతా వాటిలా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం. అశోక్ చిన్నప్పటి నుండి హీరో కావాలని ఎంతో కష్టపడ్డాడు. మంచి టీమ్ కుదిరింది. అన్నారు.
డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ… హీరో అశోక్ గల్లా మంచి ఎనర్జిటిక్ ఉన్న ఆర్టిస్ అవుతాడు, ఈ కథకు తాను కరెక్ట్ గా యాప్ట్ . ఆడియన్స్ కు అశోక్ గల్లా తన నటనతో సర్ప్రైజ్ ఇస్తాడు. నిర్మాత పద్మావతి ఈ సినిమా స్టార్ట్ కావాలని చాలా బలంగా కోరుకున్నారు. యంగ్ టీం, యంగ్ సబ్జెక్ట్‌తో వస్తున్నాం, అందరిని ఎంటర్టైన్ చెయ్యబోతున్నాం అన్నారు.
నరేష్,సత్య,అర్చన,సౌందర్య ఇతర నటీనటులు
డైలాగ్స్: కళ్యాణ్ శంకర్, ఏ.ఆర్.ఠాగూర్, కెమెరామెన్: రిచర్డ్ ప్రసాద్,సంగీతం: జిబ్రాన్
ఆర్ట్: ఏ.రామాంజనేయులు,ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి
చీఫ్ కో.డైరెక్టర్: అప్పజి సోమరాజు, కో డైరెక్టర్: కె.అరుణ్ కుమార్