అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై‘నాతిచరామి’ జై వైష్ణవి .కె నిర్మించారు. వై2కె సమస్య కారణంగా హైదరాబాద్లోని ఓ కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘నాతిచరామి’. నాగు గవర దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన చిత్ర ట్రైలర్స్ కు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రికార్డ్ స్థాయిలో అమెజాన్, హంగామా,సోనీ,టాటా స్కై,ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, యమ్.ఎక్స్, ప్లేయర్ వంటి .. 20 ఓటిటి ప్లాట్ ఫాంలలో ఈ నెల 10 న స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా….
నాగు గవర మాట్లాడుతూ … అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి… ముగ్గురి పాత్రల మధ్య జరిగే సంఘర్షణ ‘నాతిచరామి’. బలమైన సన్నివేశాలు, అర్థవంతమైన సంభాషణలు, అద్భుతమైన అభినయంతో సినిమా ఉంటుంది. శ్రీలత క్యారెక్టర్ ను డిజైన్ చేసుకొని ఈ కథకు పూనమ్ కౌర్ అయితే బాగుంటుందని తనకి ఈ కథ చెప్పడం జరిగింది..ఇంతవరకు తను చేయని రోల్ ఇది. ఇందులో తను చాలా హార్డ్ వర్క్ చేసింది.సినిమా చూసి బయటికి వచ్చిన తరువాత కూడా శ్రీలత క్యారెక్టర్ మీ వెంట వస్తుంది. ఇందులో ఉన్న కంటెంట్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.అలాగే ఈ సినిమాలో అరవింద్ ప్రభాకర్ లా కనిపించడానికి చాలా సెటిల్ద్ గా నటించాడు. ఈ సినిమా తరువాత తనకు మంచి పేరు తీసుకువస్తుంది. మార్చి 10 న ఓటిటి లో విడుదల అవుతున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.
పూనమ్ కౌర్ మాట్లాడుతూ… ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే నా జీవితానికి గగ్గరగా ఉన్న కథ “నాతి చరామి”. ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ఏ స్త్రీ మీదైనా చిన్న కన్నేసినా వాడు రాక్షసుడే..కాలం ఏదైనా కథ ఇదే.. సీతాదేవి, ద్రౌపది, దుర్గా దేవి ల కథలు చదివాను. వీరంతా కూడా సమాజంలో చాలా ఫైట్ చేసి పెద్ద ఛాలెంజ్ ను ఎదుర్కొన్నారు. 2007 లోనే పెళ్లి చేసుకొని అబ్రాడ్ కు వెళ్ళాలి అనుకున్నాను. కానీ సినిమానే నా జీవితం అయిపోయింది. చాలా మంది మద్య తరగతి నుండి వచ్చిన అమ్మాయిలకు చాలా కలలు ఉంటాయి. అవి అందరికీ నెరవేరవు. అయితే వారంతా వారి బలమేంటి , బలహీనతలేంటి తెలుసుకొని ఎంతో మనో ధైర్యంతో ముందుకెళ్లాలి. అప్పుడే సక్సెస్ సాధిస్తారు. క్రైమ్ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ డ్రామా ఇది. భార్య భర్తల మధ్య భావోద్వేగాలు ఈ సినిమాలో చాలా బావుంటాయి అన్నారు.
అరవింద్ కృష్ణ మాట్లాడుతూ… ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే ఇలాంటి రోల్స్ చాలా తక్కువ వస్తాయి. నా కెరీర్ లో “నాతిచరామి” వెరీ స్పెషల్ ఫిల్మ్ అవుతుంది. నాతి చరామి అంటేనే ప్రామిస్..ఒక వైఫ్ & హుస్బెండ్ ఆ ప్రామిస్ ను నిలబెట్టుకోవడానికి ఎంతదూరం వెళ్తారు. దానివల్ల వచ్చిన పరిణామాలేంటి? అనేది ఈ సినిమాలో దర్శకుడు నాగు చాలా చక్కగా చెప్పాడు. నాగు గారు నా కెరియర్ బిగినింగ్ నుండి నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు.ఈ సినిమా చూసిన వారందరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు.పూనమ్ గారు తన పాత్ర కొరకు చాలా కష్టపడింది అన్నారు.
“నాతిచరామి” లో ఒక ప్రధాన పాత్ర పోషించిన సందేశ్ బురి మాట్లాడుతూ… నా జీవితంలో ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. ఇందులో నా పాత్రను నాగు గారు చాలా చక్కగా డిజైన్ చేశారు.నాతో అరవింద్, పూనమ్ లు చాలా చక్కగా నటించారు. మధ్య తరగతి స్త్రీలకు చాలా సమస్యలు వస్తుంటాయి. ఎమోషనల్, ఫిజికల్ , సైకాలజికల్, ఫైనాన్షియల్, స్పిరిచ్యువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నింటి లో ఒక శత్రువు ఉంటాడు. ఆ శత్రువు రక రకాల రూపంలో మనిషి రూపంలో కావచ్చు, డబ్బు కావచ్చు ఇలా ఎదో ఒక ఆటంకం సృష్టిస్తోంది. మరి ఈ ఆటంకాలన్నిటిని ఎదుర్కొంటూ విలువలు కలిగిన కట్టుబాట్లు కలిగినటువంటి జీవితాన్ని సాధించడం చాలా కష్టమైన పని. అలాంటి ప్రోబ్లేమ్స్ అన్నిటినీ ఇందులో చూపించడం జరిగింది ఆన్నారు.
ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్ రాజీవ్ గారు మాట్లాడుతూ.. ఇందులో నటించిన వారందరూ చాలా చక్కగా నటించారు. దర్శక, నిర్మాతలు మా ఈస్ట్ వెస్ట్ ఇంటర్టైనర్ మీద నమ్మకం పెట్టుకొని.. ఎంతో ధైర్యంగా ఓటిటి లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 10 న అమెజాన్, హంగామా,సోనీ,టాటా స్కై,ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్,యమ్.ఎక్స్,ప్లేయర్ వంటి 20 ఓటిటి ఛానెల్స్ లలో విడుదల చేస్తున్నాము అన్నారు.