సి.హెచ్. సతీష్ కుమార్ అసోసియేషన్‌తో శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్, మూవీ స్లయిడర్ బ్యానర్స్‌పై జి.యన్.కుమార వేలన్ డైరెక్షన్లో ఆర్.విజయ్ కుమార్ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘ఆక్రోశం’. వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అరుణ్ విజయ్ హీరోగా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ,ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘సినం’ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో డిసెంబర్ 16న భారీ లెవల్లో విడుదల చేయటానికి నిర్మాత ఆర్.విజయ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాత సి.హెచ్.సతీష్ కుమార్ మాట్లాడుతూ… ‘‘‘ఆక్రోశం’ మూవీ ..తల్లి, తండ్రి, భర్త, భార్య, కొడుకు.. ఇలా కుటుంబంలోని అన్ని ఎమోషన్స్‌ను బ్యాలెన్స్‌ను చూపిస్తూ అందరూ కలిసి చూసే విధంగా ఉంటుంది. దీంతో పాటు సినిమాలో మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. తప్పకుండా అందిరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్‌తో చేసిన సినిమా కాట్టి ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. సినిమా అందరికీ రీచ్ కావాలనే ఉద్దేశంతో రిలీజ్ డేట్‌ను డిసెంబర్ 16కు మార్చాం. ప్రస్తుతం మన సమాజానికి చెప్పాల్సిన కొన్ని పాయింట్స్‌ను కథ రూపంలో చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్ కుమార వేలన్.ప్రేక్షకులు మా సినిమాను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు.
హీరోయిన్ పల్లక్ లల్వాని మాట్లాడుతూ.. ‘‘టాలీవుడ్ అంటే నాకు ఎంతో స్పెషల్. హైదరాబాద్‌కి వచ్చిన ప్రతీసారి నా ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. తమిళంలో ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియెన్స్ కూడా సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాం. మూవీలో మధు అనే రోల్ చేశాను. డిసెంబర్ 16న మా సినిమాను చూసి సక్సెస్ చేయండి’’ అన్నారు.
హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ.. ‘‘డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న మా ‘ఆక్రోశం’ సినిమాకు తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనేదే మా ఆలోచన. వీలైనన్ని ఎక్కువ థియేటర్స్‌లో మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మహిళలు, అమ్మాయిలు, కుటుంబ సభ్యులు అందరూ ఈ సినిమాను ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. చక్కటి మెసేజ్ ఉంటుంది అన్నారు.
‘ఏనుగు’ సినిమా సమయంలో సతీష్‌గారితో అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ఆయనే ఆక్రోశం సినిమాను రిలీజ్ చేయనుండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఆడియెన్స్‌కు చిన్న, పెద్ద అనే తేడా ఉండదు. మంచి కంటెంట్ ఉంటే తెలుగు ఆడియెన్స్ సినిమాను ఆదరిస్తుంటారు. అలాంటి ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. తప్పకుండా తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుంది. సినిమా థియేటర్స్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు ఓ ఎమోషన్‌తో బయటకు వెళతారు. షబీర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మంచి పాటలు కుదిరాయి. సిల్వగారు యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ప్లస్ అవుతుంది. వారికి నా ధన్యవాదాలు. మధు అనే పాత్రలో పల్లక్ లల్వాని అద్భుతంగా నటించింది. తన పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియెన్స్‌ను డిసప్పాయింట్ చేయదని గ్యారంటీగా చెబుతున్నాను అన్నారు.