`అర్జున్ రెడ్డి`గా విజయ్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. `పెళ్లిచూపులు`తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండను `అర్జున్‌రెడ్డి` సినిమా ఓవర్‌నైట్‌స్టార్‌గా మార్చేసింది. గతేడాది విడుదలైన ఈ సినిమా టాలీవుడ్‌ని షేక్ చేసింది. కొత్త దర్శకుడు సందీప్ వంగా రూపొందించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది.ఈ సినిమా ఇప్పుడు పలు భాషల్లో రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో `అర్జున్ రెడ్డి`గా విజయ్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు.
మరి, ఈ సినిమా కోసం విజయ్‌కు దక్కిన పారితోషికం ఎంతో తెలుసా? కేవలం 5 లక్షల రూపాయలట. ఈ విషయాన్ని ఇటీవల స్వయంగా విజయ్ వెల్లడించాడు. అయితే సినిమా విడుదలై సంచలన విజయం సాధించిన తర్వాత లాభాల్లో వాటాగా తనకు భారీ మొత్తం దక్కిందని విజయ్ చెప్పాడు.విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ మరే హీరోకు లేదనే చెప్పాలి. ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ హీరో చేస్తున్న మరో సినిమా ‘నోటా’.ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నాడు విజయ్.
కొందరు భయపెట్టినా ఆలోచించకుండా ఒప్పుకున్నా!
ఇటీవలే విడుదలైన ‘ఆర్‌ఎక్స్100’ సినిమాలో హీరోయిన్ అందాల ఆరబోత యువతలో ఉత్సుకత పుట్టించి క్రేజ్ కొట్టేసింది. హీరో హీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌ల మధ్య షూట్ చేసిన పలు సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.చిత్రంలో లిప్‌లాక్స్ కి లెక్కే లేదు. ఆమె చేసిన పెర్ఫార్మెన్స్‌కు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.ఒకరకంగా చెప్పాలంటే సినిమాకి పాయల్ రాజ్‌పుతే స్పెషల్ అట్రాక్షన్ అయింది.
పాయల్ రాజ్‌పుత్ ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదు. పైకి ప్రేమను నటిస్తూ లోపల కపటత్వాన్ని ప్రదర్శిస్తూ అందాలుఆర బోసింది . “ఇలాంటి బోల్డ్ పాత్ర చేయాలంటే చాలా సాహసం ఉండాలని… ఇవన్నీ తనలో ఉన్నాయి కాబట్టే కొందరు భయపెట్టినా ఆలోచించకుండా ఒప్పుకున్నా”నని అంటోంది పాయల్.
ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. సినిమాలో నటించేందుకు గాను పాయల్ తీసుకుంది కేవలం 6 లక్షలు మాత్రమేనట. అంత తక్కువ పారితోషికం తీసుకున్న ఈ బ్యూటీ కెమెరా ముందు అందాల ఆరబోతలో మాత్రం వెనకాడలేదు. పైగా తొలి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో రుజువు చేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పలువురు దర్శక నిర్మాతల దృష్టి పాయల్‌పై పడిందట.