‘పెళ్లి చూపులు’తో సూపర్ హిట్ ని, లేటెస్ట్గా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఎవరూ ఊహించని సెన్సేషనల్ హిట్ ని సొంతం చేసుకున్నయువ హీరో విజయ్ దేవరకొండ పారితోషికం కూడా ఇప్పుడు భారీగా పెరిగిందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ముందు విజయ్ దేవరకొండ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే విషయం ఎవరికీ పెద్దగా తెలియదు.సినిమాల ఫలితాలను బట్టే అందులో నటించిన స్టార్స్ రెమ్యూనరేషన్లో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. స్టార్ హీరోలు మొదలుకుని అప్ కమింగ్ హీరోల వరకు అందరికీ ఇదే వర్తిస్తుంది.భారీ సక్సెస్‌తో ఫుల్‌జోష్ మీదున్న ఆ కుర్ర హీరో తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేశాడట. ఇకపై కమిటయ్యే ఒక్కో సినిమాకు నాలుగు కోట్లు డిమాండ్ చేయాలని డిసైడయ్యాడట ఈ హీరో. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖాతాలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయని, వీటిలో ఎన్ని సినిమాలకు అతడు పెంచిన రెమ్యూనరేషన్ వర్తిస్తుందో చెప్పలేమని సినీజనం అభిప్రాయపడుతున్నారు.
అయితే పెంచిన పారితోషికం స్థాయిని అతడు నిలబెట్టుకోవడం అంతఈజీకాదనే కామెంట్స్ కూడా సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ తన పారితోషికాన్ని పెంచడంలో ఎవరికీ అభ్యంతరం లేకపోయినా… నిర్మాతలు అతడు కోరినంత ఇవ్వాలంటే మరికొన్ని హిట్స్ అతడి ఖాతాలో పడాల్సిన అవసరం ఉందని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. ఏదేమైనా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్లో తన రేంజ్‌ను పెంచుకున్న విజయ్ దేవరకొండ, కొత్తగా వచ్చిన తన స్థాయిని ఎంతవరకు పదిలంగా ఉంచుకుంటాడనేది చూడాలి !