`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌కు ప్ర‌శంసలు

జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై  శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస రావు ద‌ర్శ‌క‌త్వంలో సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ నిర్మిస్తున్న చిత్రం `ప్రేమెంత ప‌ని చేసె నారాయ‌ణ‌`. ఈ  చిత్ర ఆడియో ఇటీవ‌ల వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా విడుదలైంది. ఇక ఈ చిత్రంలోని సాంగ్ విజువ‌ల్స్ ను సినీ , రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆవిష్క‌రించారు.  “అట్టా సూడ‌మాకు…“ సాంగ్ విజువ‌ల్ ను జ‌య‌ప్ర‌ద, ప్ర‌ముఖ పొలిటీషియ‌న్ అమ‌ర్‌సింగ్  ఆవిష్క‌రించ‌గా,  “ఈ బుజ్జిగాడికి నచ్చేశావే…“ పాట‌ను ద‌ర్శ‌కుడు క్రిష్‌, “హ‌రిలో రంగ హ‌రి…“ విజువ‌ల్ సాంగ్ ను మాస్ మ‌హారాజ రవితే జ ఆవిష్క‌రించి… హ‌రికృష్ణ‌లో మంచి డాన్స‌ర్  తో పాటు,  అద్భ‌తుమైన యాక్ట‌ర్ ఉన్నాడంటూ ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు…
 
ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస్  మాట్లాడుతూ…“ఇటీవ‌ల వైయ‌స్ జ‌గ‌న్ గారి చేతుల మీదుగా విడుద‌లైన ఆడియో సాంగ్స్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. అలాగే  వీడియో సాంగ్స్  ప్ర‌ముఖుల చేతుల మీదుగా ఆవిష్క‌రించాం. అట్ట చూడ‌మాకు…పాట‌ను ఆవిష్క‌రించిన జ‌య‌ప్ర‌ద‌గారు  . హ‌రి టెర్రిఫిక్ డాన్స్ చేయ‌డంతో పాటు, త‌న‌లో మంచి యాక్టింగ్ స్కిల్స్  ఉన్నాయంటూ ప్ర‌శంసించారు.  అలాగే “ఈ బుజ్జిగాడికి న‌చ్చావే…పాట‌ను ఆవిష్క‌రించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ గారైతే పాట‌లన్నీ  రీ-ప్లే చేసుకుని మ‌రీ చూశారు.  డాన్స్, ఫైట్స్ బాగా చేయ‌డ‌మే కాదు…హ‌రి భ‌విష్య‌త్ లో మంచి హీరోగా ఎదుగుతాడ‌ని బ్లెస్ చేశారు. మూడో పాట “హ‌రిలో రంగ హ‌రి…“ పాట‌ను ఆవిష్క‌రించిన ర‌వితేజ గారు..మాస్ మూమెంట్స్ హ‌రి ఇర‌గ‌దీసాడు అంటూ మెచ్చుకున్నారు.  ఇలా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన చాలా  మంది మా హ‌రికి   స‌పోర్ట్ చేయ‌డం చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది.   జ‌గ‌ప‌తి బాబు గారు వాయస్ ఓవ‌ర్ ఇచ్చారు. అది సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంది. ఆదిత్య మ్యూజిక్ వారు పాట‌ల‌ను బాగా ప్ర‌మోట్ చేస్తున్నారు. యాజ‌మాన్య గారు అద్భుత‌మైన పాట‌లిచ్చారు. ఇందులో ల‌వ్ తో పాటు మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. ఝాన్సీ గారు విభిన్న‌మైన పాత్ర చేశారు. మా నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించ‌డ‌మే కాకుండా అద్భుత‌మైన ప‌బ్లిసిటీ చేస్తున్నారు. ఇందులో పాట‌లు విజువ‌ల్ ప‌రంగా ఇంత బాగా వ‌చ్చాయంటే ప్రేమ్ ర‌క్షిత్ గారే కార‌ణం“ అన్నారు.
 
హీరో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ…“జ‌గ‌న్ గారి చేతుల మీదుగా విడుద‌లైన పాట‌లు ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ అయ్యాయి. సాంగ్ విజువ‌ల్స్ కూడా సినీ ప్ర‌ముఖులు రిలీజ్ చేసి బ్ల‌స్ చేయ‌డం చాలా హ్యాపీ. ముఖ్యంగా ముంబై వెళ్లి జ‌య‌ప్ర‌ద గారి చేతుల మీదుగా అట్ట చూడ‌మాకే సాంగ్ విడుద‌ల చేయించాం. జ‌య‌ప్ర‌ద మేడ‌మ్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్ప‌టికీ మ‌రువ‌లేను. అలాగే క్రిష్‌గారు, ర‌వితేజ‌గారు కూడా ఎంతో ఎంక‌రేజ్ చేశారు. అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా“ అన్నారు.
 
హీరోయిన్ అక్షిత మాట్లాడుతూ…“ఈ చిత్రంలో పాట‌ల‌న్నీ ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డం హ్యాపీగా ఉంది.  నా క్యార‌క్ట‌ర్ కు సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన  ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు  ధన్య‌వాదాలు“అన్నారు.
 
పాట‌ల ర‌చ‌యిత రాంబాబు గోసాల మాట్లాడుతూ…“ఇందులో మూడు పాట‌లు రాశాను. యాజ‌మాన్య గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గారితో తో వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది. హ‌రికృష్ణ‌కు ఈ సినిమా మంచి ఆరంభ‌మ‌వుతుంద‌న్నారు.
 
ఆదిత్య నిరంజ‌న్ మాట్లాడుతూ…“పాట‌ల‌కు మంచి స్పంద‌న వస్తోంది. హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న హ‌రికి , టీమ్ అంద‌రికీ  ఆల్ ది బెస్ట్ “ అన్నారు.
 
సంగీత ద‌ర్శ‌కుడు యాజ‌మాన్య మాట్లాడుతూ…“పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న  సినిమాకు కూడా పెద్ద  స‌క్సె స్ సాధిస్తుంద‌న్న‌ న‌మ్మ‌కం ఉంద‌న్నారు.
 
ఝాన్సీ , చిలుకూరి గంగారావు, ఎఆర్‌సి.బాబు, రాహుల్ బొకాడియా , పింగ్ పాంగ్, రాఘ‌వ‌పూడి, రాజారావు త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి క‌థఃజేయ‌స్ఆర్ మూవీస్; స‌్క్రీన్ ప్లేః భూప‌తిరాజా, మ‌రుధూరిరాజా, రాజేంద్ర‌కుమార్;  మాట‌లుఃసుబ్బ‌రాయుడు బొంపెం; స‌ంగీతంః యాజ‌మాన్య‌;  పాట‌లుః వ‌న‌మాలి, గోసాల రాంబాబు; ఎడిట‌ర్ః జాన‌కిరామ్‌;  కెమెరాః పియ‌స్‌వంశీ ప్రకాష్‌;  కొరియోగ్ర‌ఫీః ప్రేమ్ ర‌క్షిత్‌, విద్వాసాగ‌ర్‌, శ్రీధ‌ర్‌;  నిర్మాతః సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ‌; ద‌ర్శ‌క‌త్వంః జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు.