2014,15,16 సంవత్సరాలకు నంది అవార్డులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను నంది అవార్డులు, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య సినిమా పురస్కారాలను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసిన జ్యూరీ కమిటీ సభ్యులు వివరాలను వెల్లడించారు. కమిటీ ప్రతినిధులు నందమూరి బాలకృష్ణ, మురళీ మోహన్‌, గిరిబాబు, జీవిత తదితరులు అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 2014, 2015, 2016 సంవత్సరాలకు లెజెండ్‌, బాహుబలి(బిగినింగ్‌), పెళ్లి చూపులు చిత్రాలు నంది అవార్డులు  కైవసం చేసుకున్నాయి. ఉత్తమ నటులుగా బాలకృష్ణ, మహేష్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ నంది అవార్డులకు ఎంపికయ్యారు. 
 
నంది అవార్డులు 2015
ఉత్తమ చిత్రం లెజెండ్‌ 
ఉత్తమ నటుడు (బాలకృష్ణ(లెజెండ్‌) 
ఉత్తమ ప్రజాదరణ చిత్రం లౌక్యం 
ఉత్తమ దర్శకుడు – బోయపాటి శీను( లెజెండ్‌)
ఉత్తమ ప్రతినాయకుడు జగపతిబాబు(లెజెండ్‌) 
ఉత్తమ సహాయ నటుడు నాగచైతన్య(మనం) 
ద్వితీయ ఉత్తమ చిత్రం- మనం 
ఉత్తమ నటి- అంజలి(గీతాంజలి) 
ఉత్తమ ఛాయాగ్రాహకుడు సాయి శ్రీరామ్‌(అలా ఎలా) 
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ 
ఉత్తమ ఫైట్‌మాస్టర్‌ రామ్‌ లక్ష్మణ్‌(లెజెండ్‌) 
ఉత్తమ బాలనటుడు గౌతమ్‌కృష్ణ (నేనొక్కడినే) 
ఉత్తమ రచయిత- ఎం.రత్నం 
ఉత్తమ సహాయ నటి- మంచు లక్ష్మి(చందమామ కథలు) 
ఉత్తమ హాస్యనటుడు- బ్రహ్మానందం (రేసుగుర్రం)
 
నంది అవార్డులు 2015
 
ఉత్తమ చిత్రం బాహుబలి(బిగినింగ్‌) 
ఉత్తమ నటుడు మహేష్‌బాబు (శ్రీమంతుడు) 
ఉత్తమ కుటుంబ కథాచిత్రం- మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు 
బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- కంచె 
ఉత్తమ బాలల చిత్రం -దానవీర శూరకర్ణ 
ఉత్తమ నటి అనుష్క(సైజ్‌ జీరో) 
ఉత్తమ దర్శకుడు  రాజమౌళి( బాహుబలి) 
ఉత్తమ హాస్యనటుడు- వెన్నెల కిశోర్‌ (భలే భలే మగాడివోయ్‌) 
ద్వితీయ ఉత్తమ చిత్రం- ఎవడే సుబ్రమణ్యం 
తృతీయ ఉత్తమ చిత్రం- నేను శైలజ 
ఉత్తమ మాటల రచయిత- సాయిమాధవ్‌( మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు) 
ఉత్తమ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి
 
నంది అవార్డులు 2016
 
ఉత్తమ చ్రితం- పెళ్లిచూపులు
ద్వితీయ ఉత్తమ చిత్రం- అర్ధనారి 
తృతీయ ఉత్తమ చిత్రం- మనలో ఒకడు
ఉత్తమ నటుడు- జూనియర్‌ ఎన్టీఆర్‌(జనతాగ్యారేజ్‌)
ఉత్తమ నటి- రీతువర్మ(పెళ్లి)చూపులు
ఉత్తమ విలన్‌ – ఆదిపినిశెట్టి(సరైనోడు)
ఉత్తమ దర్శకుడు – సతీష్‌ వెగేష్న(శతమానంభవతి)
ఉత్తమ సంగీత దర్శకుడు  – మిక్కీ(అఆ)