కౌండిన్య మూవీస్ పతాకంపై నటుడు, నిర్మాత తాళ్లపల్లి దామోదర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం `అనువంశికత`. `పెరెల్స్ ఆఫ్ కిన్ షిప్ లవ్` అనేది ఉపశీర్షిక. సంతోష్ రాజ్, నేహా దేశ్ పాండే జంటగా నటిస్తున్నారు. రమేష్ ముక్కెర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మంగళవారం ఫిలించాంబర్ లో తెలంగాణా శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మధుసూదనా చారి మాట్లాడుతూ…“ట్రైలర్ బావుంది. చిత్ర దర్శక నిర్మాతలు మా గ్రామస్తులే. మొదట దాము సినిమా చేద్దామనుకుంటున్నానని నాతో చెప్పినప్పుడు తేలికగా తీసుకున్నాను. కానీ పట్టుదలతో ఓ గొప్ప సినిమా చేశాడు. సినిమా తీయడమే సాహసం. అలాంటిది సమాజానికి సందేశం అందించే సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. ఇంత వరకూ ఎవరు టచ్ చేయని అంశంతో సినిమా చేస్తోన్న దర్శక నిర్మాతలను అభినందిస్తున్నా. ఇలాంటి కాన్సెప్ట్స్ తో వచ్చే చిత్రాలను ఆదరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కసి, కృషి ఉంటే ఎవరైనా సక్సెస్ సాధించగలరని నేను నమ్ముతాను. అలా ఈ టీమ్ అంతా చేసిన ఈ ప్రయత్నం ఫలించాలనీ, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా“అని తెలిపారు.
సాయి వెంకట్ మాట్లాడుతూ…“మేనరికాలపై తీసిన ఈ సినిమా ఇది. ఇంత వరకు ఎవరూ స్ఫృశించని అంశం. సమాజానికి ఉపయోగపడే చిత్రం కాబట్టి ఆదరించాల్సిన బాధ్యత అందరిదీ“ అని తెలిపారు.
నటుడు సుమన్ మాట్లాడుతూ…“సినిమాల పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది . దానికి ఇటీవల కొన్ని సినిమాల పుటేజ్ బయటకు రావడమే ఉదాహారణ. ఇలాంటివి పునరావృత్తం కాకుండా ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకరావాలి. ఇక ఈ సినిమాలో ఓ గొప్ప సందేశంతో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉన్నాయి.. ఇందులో నేను మంచి పాత్ర చేశాను. దర్శకుడు రమేష్ గారే దీనికి మ్యూజిక్ కూడా చేశారు. పాటలు అద్భుతంగా ఉన్నాయి. చిత్ర నిర్మాత ఇందులో మంచి పాత్ర కూడా చేశారు“ అన్ని అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ…“నిర్మాత దాము గారు నాకు ఇష్టమైన పర్సన్. మేనరికాల వల్ల అంగవైకల్యంతో ఉండే పిల్లలు పుడతారు. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవలసి వస్తుందన్న అంశంతో పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ సినిమా రూపొందింది. దర్శకుడు చాలా బాగా డీల్ చేశారు. పాటలు కూడా బాగా కుదిరాయి. ఇలాంటి సినిమాకు ప్రభుత్వం పన్ను రాయితీ కల్పిస్తే బావుంటుంది. ఈ సినిమాను చదలవాడ శ్రీనివాసరావు గారు రిలీజ్ చేయడానికి ముందుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
హీరోయిన్ నేహా దేశ్ పాండే మాట్లాడుతూ…“ఇదొక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిం. చాలా మంచి క్యారక్టర్ చేశాను. మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. అందరూ సినిమాను చూసి బ్లెస్ చేయాలన్నారు.
సహనిర్మాత డా.ఎమ్ డి యాకూబ్ మాట్లాడుతూ…“స్పీకర్ మధుసూదనాచారి గారు ఇటీవల సినిమా చూసి ప్రశంసించారు. దర్శకుడు రమేష్ ముక్కెర చెప్పిన కథ నచ్చి ఎవరూ చేయని అంశంతో సినిమా చేశాం. ఈ నెల 24న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామన్నారు.
నిర్మాత దామోదర్ గౌడ్ మాట్లాడుతూ…“సినిమా షూటింగ్ మొత్తం వరంగల్ లో చేశాం. నేను ఇనిస్పిరేషన్ గా తీసుకునే మధుసూదనాచారి గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ నెల 24న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం“ అని తెలిపారు.
దర్శకుడు రమేష్ ముక్కెర మాట్లాడుతూ…``భావి తరాలకు మేనరికపు సంబధాలు చేసుకుంటే జరిగే అనర్థాలను మా సినిమా ద్వారా చూపిస్తున్నాం. సెన్సార్ కార్యక్ర మాలు పూర్తయ్యాయి. ఎన్నో కష్టాలకోర్చి సినిమాను తీసాం. ఇటీవల మా చిత్రాన్ని చూసి చాలా మంది ప్రముఖులు, సె న్సార్ సభ్యులు సినిమాకు కచ్చితంగా అవార్డ్ వస్తుందని చెప్పడం చాలా సంతోషం “ అని చెప్పారు.