కన్నడ బ్యూటీ అనుష్క… ‘అరుంధతి’ ,’వేదం’, ‘సైజ్ జీరో’, ‘పంచాక్షరి’, ‘నాగవల్లి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’, ‘భాగమతి’ వంటి వైవిధ్యమున్న కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో తెలుగునాట అగ్ర నాయికగా దూసుకుపోతున్న తార అనుష్క. అంతేకాదు,పాత్ర డిమాండ్ చేస్తే… ఎంత రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడని కథానాయికగా పేరు తెచ్చుకుంది.
గత ఏడాది ‘బాహుబలి – ది కంక్లూజన్’లో దేవసేనగా అలరించిన అనుష్క… ఈ సంవత్సరం ‘భాగమతి’లో టూ షేడ్స్ ఉన్న పాత్రలో అభిమానులను మరోసారి ఆకట్టుకుంది. ఆ సినిమా విడుదలై ఏడాది గడచినా మరో చిత్రాన్నిపట్టాలెక్కించలేదు. అయితే ఇందుకో స్పెషల్ రీజన్ ఉందని టాక్. ‘సైజ్ జీరో’ కోసం బాగా లావైపోయిన అనుష్క.. ఆ తరువాత తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేయడంపైనే దృష్టి పెట్టాల్సి రావడంతో లావు తగ్గడంపై దృష్టి సారించలేదు. అయితే ‘భాగమతి’ విడుదలైన తరువాత పూర్తిగా సన్నబడడంపైనే ఫోకస్ చేసిన ఈ భామ ఎట్టకేలకు అనుకున్నది సాధించిందట.
అనుష్క ‘సైలెన్స్’ పేరుతో ఓ బైలింగ్వల్ మూవీకి ఓకే చెప్పింది. ‘సైలెన్స్’ పేరుతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సైలెంట్ థ్రిల్లర్ని ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్నాడు. తమిళ నటుడు మాధవన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చూపు, వినికిడి శక్తి లేని అమ్మాయిగా కనిపించనుందట అనుష్క. అందుకే పాత్రను మరింత రక్తి కట్టించడం కోసం అంధులను, వారికి ప్రత్యేక శిక్షణనిచ్చే ట్యూటర్లను గమనిస్తూ… మెళకువలు నేర్చుకుంటోందట. చాలెంజింగ్ రోల్స్ చెయ్యడాన్ని ఆస్వాదించే అనుష్క ఈ పాత్రనూ చాలెంజింగ్ గానే తీసుకుంది.