బాలీవుడ్లో అందాల తారలందరినీ వెనక్కి నెట్టేసి.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఒక్కరే ఫోర్బ్స్ ఆసియా జాబితాలో చోటు దక్కించుకుంది. తాజాగా ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 పేరిట విడుదల చేసిన జాబితాలో అనుష్క మాత్రమే చోటు దక్కించుకుంది. యూత్ ఐకాన్‌గా నిలిచిన 30 ఏళ్లలోపు గల ప్రముఖులందరి పేర్లతో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 పేరిట జాబితాను విడుదల చేసింది. 29 ఏళ్ల అనుష్కను యూత్ ఐకాన్‌గా గుర్తించిన ఫోర్బ్స్.. ఈ జాబితాలో ఆమె పేరును చేర్చింది.
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ బీటౌన్‌లో బిగ్గెస్ట్ పవర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో అనుష్క శర్మ ఒకరు. 29 ఏళ్ల అనుష్క.. 2007లో మోడల్‌గా తన కెరియర్ను ప్రారంభించింది. 2008లో ‘రబ్ నే బనా ది జోడి’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నటించిన అనుష్కకు బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది.
ఫోర్బ్స్ లిస్ట్‌లో అనుష్కతో పాటు.. ‘బబుల్ కీబోర్డ్’ కో ఫౌండర్ అంకిత్ ప్రసాద్, ‘గయామ్ మోటార్ వర్క్స్’ సిటిఒ రాహుల్ గయామ్, ‘వాహ్దమ్’ టీ ఫౌండర్, సీఈఓ బాలా సార్దా, జైపూర్ మహారాజ పద్మనాథ్ సింగ్, ‘మిన’ మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుహాని జలోట, ముంబైలోని మురికివాడకు చెందిన ముగ్గురు మహిళలను ఎంపిక చేశారు.