స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యలవాడ నర్సింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందనున్న `సైరా` సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇది 19వ శతాబ్దానికి చెందిన కథ కావడంతో నేరుగా కథలోకి వెళ్లకుండా, `బాహుబలి`తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన అనుష్క చేత `సైరా` కథ చెప్పించబోతున్నారట. `సైరా`లో నటించడం గురించి చాలా రోజులు ఆలోచించిన స్వీటి ఎట్టకేలకు ఓకే చెప్పిందట. ఈ ప్రత్యేక పాత్రలో నటించినందుకుగానూ అనుష్క భారీ రెమ్యునరేషన్ అందుకోబోతోందోట. దేశవ్యాప్తంగా పరిచయం ఉన్న హీరోయిన్ కాబట్టి, అమె వల్ల సినిమాకు ఇతర భాషల్లోనూ డిమాండ్ పెరుగుతుందనే కారణంతో అనుష్క అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాత చెర్రీ అంగీకరించాడట.
ఆ సీక్రెట్స్ పుస్తకరూపంలో
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి `భాగమతి` సినిమా తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. అందుకు కారణం.. అంతకు ముందు ఓ సినిమాలో పాత్ర కోసం పెరిగిన బరువును తగ్గించుకోవడానికి.. సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు. బరువు తగ్గిన తర్వాత అనుష్క కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అందుకు కారణం.. ఆమె కెరీర్ ప్రారంభంలో నాజుగ్గా ఉన్నట్లు ఉండటమే.
బరువు తగ్గడానికి అనుష్క ఏడాది సమయం తీసకున్నారు. అయితే ఈ సమయంలో అందంలో ఇసుమంత తేడా లేకుండా బరువు ఎలా తగ్గారని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ సీక్రెట్స్‌ను అనుష్క ఓ పుసక్త రూపంలో చెప్పనుంది. `ది మ్యాజిక్ వెయిట్ లాస్ పిల్` అనే పేరుతో అనుష్క, ల్యూక్ కుటిన్హో ఓ పుస్తకాన్ని రాశారు. మన లైఫ్ స్టయిల్లో మనం ఫాలో కావాల్సిన 62 పద్ధతులు ఈ పుసక్తంలో ఉంటాయి. త్వరలోనే ఈ పుస్తకం మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం అనుష్క మాధవన్‌తో కలిసి `సైలెన్స్` అనే చిత్రంలో నటిస్తున్నారు.