అనుష్క ప్రస్తుతం ‘భాగమతి’ అనే థ్రిల్లర్ మూవీ కోసం ఎదురు చూస్తోంది.అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి నటించి తనలోని సత్తాని నిరూపించుకున్నఆమె ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో చేసిన ‘భాగమతి’ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది.. చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని రూపొందిస్తుండగా, గ్రాఫిక్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. చాలా రోజుల క్రితం మొదలైన భాగమతి సినిమాలో అనుష్క లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానులలో చాలా ఉంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని భావిస్తున్నారట.
సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన భాగమతి చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించగా, ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. విద్యు రామన్, జయరాం, ఉన్ని ముకుందన్ మరియు ఆశా శరత్ సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. యూవి క్రియేషన్స్ బేనరన్ పై వంశీ కృష్ణా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాగమతి చిత్రాన్ని తెలుగులోనే కాక తమిళం, మలయాళ భాషలలోను డబ్ చేసి విడుదల చేయనున్నట్టు సమాచారం. అయితే భాగమతి చిత్రం సంక్రాంతికి విడుదల కానుందని గతంలో వార్తలు వచ్చినప్పటికి, వీలైనంత త్వరగా ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోందట
అనుష్క కోసం అయిదు కోట్లు ఖర్చు
ఏ పాత్రలోనైన నటించి మెప్పించే నటి అనుష్క. ఆమె చిత్రసీమకొచ్చి పదేళ్ల పైనే అయినా ఇంకా తన అందచందాలతో అలరిస్తూనే ఉంది. అలాగే కొన్ని పాత్రల్లో మరచిపోలేని నటననూ ప్రదర్శించింది. బాహుబలితో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ఇప్పుడు మరో చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమాలో అనుష్క కోసం అయిదు కోట్లు ఖర్చు పెడుతున్నారట.
తెలుగు, తమిళ భాషల్లో అనుష్కకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం ఆమె తెలుగులో ‘భాగమతి’ తప్ప మరో సినిమా చేయడం లేదు. పూర్తి బరువు తగ్గిన తర్వాత మాత్రమే మరో సినిమా చేయాలని తాను భావిస్తుందట. అయితే భాగమతి చిత్రంలోను అనుష్క లావుగా కనిపిస్తున్నందున చిత్ర దర్శకుడు అశోక్ ఆమెని నాజూకుగా చూపించేందుకు సీజీవర్క్ కోసం 5 కోట్లను అదనంగా ఖర్చు పెట్టబోతున్నాడట. అరుంధతి, రుద్రమదేవి వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాల మాదిరిగానే ఈ మూవీ మంచి హిట్ అవుతుందని అంటున్నారు.