అనుపమ పరమేశ్వరన్… `ప్రేమమ్` సినిమాతో దక్షిణాదిన మంచి గుర్తింపు సంపాదించుకుంది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత టాలీవుడ్‌కు మకాం మార్చి పలు అవకాశాలు అందుకుంది. `అఆ`, `ప్రేమమ్`, `శతమానం భవతి` వంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ విజయాలను అందుకుంది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
గతేడాది `కృష్ణార్జున యుద్ధం’,`తేజ్ ఐ లవ్యూ`,`హలోగురూ ప్రేమకోసమే’ వంటి సినిమాలతో అనుపమ నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఆమెకు తెలుగు చిత్ర సీమ నుంచి అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఆమె తొలి కన్నడ సినిమా `నటసార్వభౌమ` మాత్రం విజయం సాధించింది. కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు శాండల్‌వుడ్ నుంచి పలు ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, వరుసగా కన్నడ సినిమాలు చేయాలని అనుపమ అనుకుంటోందట. మరి, అక్కడైనా అనుపమ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందో లేదో చూడాలి.
అరుదైన రికార్డు దక్కించుకుంది !
దక్షిణాదిన కథానాయికగా తనదైన శైలితో ముందుకు సాగుతోంది అనుపమ పరమేశ్వరన్. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా అనిపించే రూపం అనుపమ పరమేశ్వరన్ సొంతం. అందుకే అనతి కాలంలోనే తెలుగువారికి ఎంతో దగ్గరయ్యింది ఈ కేరళ కుట్టి. అంతేకాదు తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ మురిపిస్తోంది. మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ప్రేమమ్’తో కథానాయికగా తొలి అడుగులు వేసిన అనుపమ.. ‘అ ఆ’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ‘‘అ ఆ, ప్రేమమ్, శతమానం భవతి’’ చిత్రాల విజయాలతో తెలుగునాట హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. యువ కథానాయకుల పక్కన చక్కని జోడీగా ఆకట్టుకుంది.
దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటించిన అనుపమ.. తాజాగా ఓ అరుదైన రికార్డును దక్కించుకుంది. అదేమిటంటే అన్ని భాషల్లోనూ తొలి చిత్రాలతో విజయాలను చవిచూసింది. తెలుగులో ‘అ ఆ’.. మలయాళంలో ‘ప్రేమమ్’.. తమిళంలో ‘కొడి’.. కన్నడంలో ‘నటసార్వభౌమ’ చిత్రాలతో ఈ రికార్డును కైవసం చేసుకుందీ అందాల తార. ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకుంటూ అనుపమ కెరీర్‌లో మరింత ఎదిగాలని కోరుకుందాం.