ఐదు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి పర్యవేక్షణలో `గాలి సంపత్` రూపొందుతోంది. అనిల్ కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ తో సినిమాకి స్పెషల్ క్రేజ్ వచ్చింది. శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ `గాలి సంపత్`గా టైటిల్ రోల్ పోషిస్తున్నఈ మూవీకి అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి11న గ్రాండ్‌గా విడుదలవుతుంది.
చిన్న సినిమాలు కూడా తీయాలి !… `ఏ దర్శకుడైనా ఒక చిన్న సినిమాతో మొదలై సక్సెస్ సాధిస్తూ పెద్ద చిత్రాలకు దర్శకత్వం వహిస్తుంటారు. కాని ఈ సమయంలో చిన్న సినిమాలను మర్చిపోతారు. మనం చరిత్ర చూసుకుంటే పెద్ద దర్శకులందరూ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీశారు. అందుకే వారు వంద సినిమాల మార్క్‌ను ఈజీగా దాటగలిగారు… అని అన్నారు ప్రొడ్యూసర్ దిల్‌రాజు మాట్లాడుతూ. అనిల్ కి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాకి కూడా నీ సహాయ సహకారాలు అందించమని చెప్పాను. అలా అనిల్ ఈ సినిమాను బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. మార్చి 11న విడుదల అవుతున్న గాలి సంపత్ తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. ఒక పెద్ద దర్శకుడు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీయాలి. ఎందుకంటే చిన్న సినిమాలకు ప్రేక్షకులు రావాలంటే ఆ సినిమాకు ఏదో ఒక ఎక్స్ ట్రా ఫోర్స్ ఉండాలి. దర్శకుడు అనీష్ దగ్గర కూడా ఒక మంచి కామెడీ టింజ్ ఉంది. ఆయన దర్శకత్వం వహించిన ‘అలా ఎలా?’ సినిమా చూస్తున్నప్పుడు నేను కడుపుబ్బ నవ్వాను. రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీ విష్ణు ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ని చాలా ఎక్స్ట్రార్డినరీగా పండించారు. థియేటర్ కి వచ్చే ప్రేక్షకులకు కావాల్సిన అనిల్ రావిపూడి, అనీష్ కృష్ణ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఎమోషన్స్‌ని కూడా జోడించారు.షైన్ స్క్రీన్స్ నిర్మాతలు సాహూ, హరీష్ నాకు సన్నిహితులు. వారికి, ప్రొడ్యూసర్ గా పరిచయం అవుతున్న సాయి కృష్ణకు, అనిల్ రావిపూడికి ఆల్ ది బెస్ట్” అన్నారు.
ఆ మ్యాజిక్ మిస్ అవకూడదనే… “ఎస్ క్రిష్ణ నా ప్రతి సినిమాలో స్టోరీ సిట్టింగ్స్ లో చాలా కీలక పాత్ర పోషించేవాడు. ఫస్ట్ టైం ఒక కథ రాసి ఆ కథతో ‘నిర్మాతగా మారాలని అనుకుంటున్నాను’ అని చెప్పినప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తాను అని చెప్పాను… అని అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ. ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలబడడానికి షైన్ స్క్రీన్స్ నిర్మాతలు ముందుకు వచ్చారు. ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఎస్ క్రిష్ణ నిర్మాతగా మొదటి సినిమా గాలి సంపత్. కథలో ఉన్న మ్యాజిక్ మిస్ కాకూడదనే మేం అందరం కలిసి ఒక టీమ్‌గా ముందుకెళ్లడం జరిగింది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి గొంతు కి ప్రమాదం జరిగి అతని గొంతులో నుంచి మాట బయటికి రాదు కేవలం గాలి మాత్రమే వస్తుంది. అదే ఈ సినిమా కాన్సెప్ట్. ‘బాహుబలి’ లో కిలికి భాష అని ఉంటుంది. అలాగే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక చిలిపి భాష మాట్లాడటం జరిగింది. అదే ‘ఫి..ఫి.. ఫీ లాంగ్వేజ్’. అది మీ అందర్నీ ఎంతో ఎంటర్టైన్ చేయబోతుంది. తండ్రీ కొడుకుల మధ్య ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ కూడా ఈ సినిమాలో ఉంది. ముఖ్యంగా ఒక 30 అడుగుల లోతు నుయ్యిలో మాటలు రాని గాలి సంపత్ పడినప్పుడు తను ఎలా బయటపడ్డాడు అనేది సెకండాఫ్. ఇలాంటి చాలా థ్రిల్లింగ్ పాయింట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ మ్యాజికల్ సన్నివేశాలు అద్భుతంగా రావాలనే ఈ సినిమాకు నా కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. దిల్ రాజు గారు, శిరీష్ గారు నా జర్నీ లో ఒక ఫ్యామిలీ లాగా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు” అని అన్నారు.
నా లైఫ్‌లో అనిల్ ఒక మెయిన్ పిల్లర్!… చిత్ర నిర్మాత ఎస్ క్రిష్ణ మాట్లాడుతూ -‘ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి దగ్గర నేను రచయితగా, దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఇప్పుడు గాలి సంపత్ సినిమాతో ఫస్ట్ టైం నిర్మాతగా పరిచయ మవుతున్నాను. నా లైఫ్‌లో అనిల్ ఒక మెయిన్ పిల్లర్. ఈ సినిమా అనిల్ రావిపూడి రాకతో పెద్ద సినిమాగా తయారయింది. నా స్నేహితులు షైన్ స్క్రీన్స్ నిర్మాతలు చాలా సపోర్ట్ సపోర్ట్ చేశారు. దర్శకుడు అనీష్ చాలా చక్కగా తెరకెక్కించాడు. దిల్ రాజు గారు, శిరీష్ గారు నాకు మొదటినుండి సపోర్ట్ అందిస్తూ వచ్చారు. వారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమా నిర్మాణంలో నాకు సపోర్ట్ చేసిన హరీష్ గారికి, సాహు గారికి నా ధన్యవాదాలు“ అన్నారు.
సినిమా బ్రహ్మాండంగా వచ్చింది!… షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ- ‘ఎస్ క్రిష్ణ చెప్పిన స్టోరీ బాగా నచ్చి ఈ సినిమా నిర్మాణంలో భాగం అవడం జరిగింది. చిన్న సినిమాగా మొదలై అనిల్ రావిపూడి రాకతో ఒక పెద్ద సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. దిల్ రాజు గారు ఎంతో సపోర్ట్ చేశారు. ” అని అన్నారు.
అనిల్ రావిపూడి గారు ఫుల్ సపోర్ట్ !… చిత్ర దర్శకుడు అనీష్ మాట్లాడుతూ – “గాలి సంపత్ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా మార్చి11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనిల్ రావిపూడి గారు ఒక మెంటర్‌గా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు సినిమాలో మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి.రాజేంద్ర ప్రసాద్ గారు, సాయి కుమార్ గారు, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ గారు గాలి సంపత్ పాత్రకు ప్రాణం పోశారు.ఈ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి సాయి కృష్ణ గారికి, హరీష్ పెద్ది, సాహు గారపాటి గారికి ధన్యవాదాలు. దిల్ రాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.
కథ: ఎస్. క్రిష్ణ, రచనా సహకారం: ఆదినారాయణ,సినిమాటోగ్రఫి: సాయి శ్రీ రామ్, సంగీతం: అచ్చురాజమణి, ఆర్ట్: ఎ ఎస్ ప్రకాశ్, ఎడిటర్: తమ్మిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగమోహన్ బాబు. ఎమ్,మాటలు: మిర్చికిరణ్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి,ఫైట్స్: నభ, కొరియోగ్రఫి: శేఖర్, భాను,
చీఫ్ కో డైరెక్టర్: సత్యం బెల్లంకొండ.