అనసూయ భరద్వాజ్, సాయికుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్ నటిస్తున్న`అరి`చిత్రం టైటిల్ లోగో విడుదలయింది. హుజూరాబాద్ ఎం.ఎల్.ఎ. శానంపూడి సైదిరెడ్డి, అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు.`పేపర్ బాయ్`తో హిట్ కొట్టిన జయశంకర్ దర్శకత్వంలో , ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా, ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు.
ఎం.ఎల్.ఎ. సైదిరెడ్డి మాట్లాడుతూ… మూవీ, రాజకీయాలకు దగ్గర పోలిక వుంటుంది. ఏదోరకంగా సక్సెస్ కావాలని చూస్తారు. ఇక అనూప్ సంగీతం ఇక్కడేకాదు విదేశాల్లోనూ ఫేమస్. దర్శకుడు జయశంకర్ పేపర్ బాయ్‌ను అందిరికీ నచ్చేవిధంగా తీశాడు. అనసూయ రంగస్థలం సినిమాకు ముందు వేరేగా వుండేది. ఆ సినిమా చూశాక ఆమెలో ప్రతిభ వుందని అందరికీ తెలిసింది. ఈ సినిమాకు నటీనటులే బలం. టైటిల్‌లోనే కొత్త దనం వుంది. నా చేయికూడా మంచిది. దక్షిణాది సినిమా హాలీవుడ్‌ను శాసించే స్థాయిలో వుంది. అందిరికీ ఆల్‌ది బెస్ట్ తెలిపారు.
‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… ఆర్.వి. సినిమాస్ `అరి`. నో బడీ నోస్.. అనే టైటిల్ చాలా వెరైటీగా వుంది. నిజాయితీగా పనిచేస్తే ఈ రంగంలో సక్సెస్ వస్తుంది. రావడం లేటయినా రావడం పక్కా. దర్శకుడు జయశంకర్ పేపర్ బాయ్ సినిమాను చాలా అందమైన ప్రేమకథగా చూపించాడు.ఈ సినిమాతో కమర్షియల్ బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అనసూయ నటిగానే కాదు. సోషల్ ఎవేర్‌నెస్‌కూడా ఆమెలో కనిపిస్తుంది. రంగమ్మత్తకు ముందు, ఆ తర్వాత అన్నట్లు ఆమెకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది అన్నారు.
అనసూయ మాట్లాడుతూ… దర్శకుడు కథ చెప్పినప్పుడే చాలా కుతూహలం కలిగింది. రంగస్థలంలో రంగమ్మత్తగా చేశాక ఇంత పేరు వస్తుందని అనుకోలేదు. ఆ తర్వాత రెండేళ్ళపాటు అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. లక్కీగా ఫీలవుతున్నాను. నాకోసం కేరెక్టర్లు రాస్తున్నారు. పుష్ప చాలా సంతృప్తినిచ్చింది. రెండో భాగంలో మంచి పాత్ర వుంది. `అరి` సినిమాలో హ్యూమానిటీతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా వుంది. అందరికీ నచ్చుతుంది అని చెప్పారు.
అనూప్ రూబెనర్స్ మాట్లాడుతూ… నేను నిర్మాతలను యు.ఎస్.లో కలిశా. పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నా సినిమాపై ప్యాషన్‌తో వచ్చారు. శేషుగారికి పెద్ద సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను. మ్యూజిక్‌కు స్కోప్ వున్న చిత్రమిది అన్నారు.
చిత్ర దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ… `అరి` అనే టైటిల్‌ను చెప్పడానికి చాలా కష్టపడ్డాను. `అరి` అనేది సంస్కృతపదం. శత్రువు అని అర్థం. అది ఏమిటి? అనేది సినిమాలో చెప్పాను. ఈ సినిమాను 2020లో కరోనా టైంలో చాలా స్ట్రగుల్ పేస్ చేసి తీశాం. అనసూయగారు కథ చెప్పగానే అంగీకరించారు. అనూప్‌గారికి కథ చెప్పగానే వెంటనే చేస్తున్నా అన్నారు. మూడు మంచి ట్యూన్స్ ఇచ్చారు. పేపర్‌బాయ్ కంటే ఈ సినిమాకు మంరిత పేరు వస్తుందనే నమ్మకముంది అన్నారు.
నిర్మాత శేషు మాట్లాడుతూ… మనిషి ఎలా బతకాలో అనేది ఇంతకుముందు సినిమాలు చూపించాయి. కానీ మా సినిమా మనిషి ఎలా బతకకూడదో చూపిస్తుంది. మంచి విజన్ వున్న దర్శకుడు జయశంకర్. పేపర్ బాయ్‌కన్నా వందరెట్లు ఈ సినిమా వుంటుంది. అనూప్ లేకపోతే ఈ సినిమా వుండేదికాదు అని తెలిపారు.
మరో నిర్మాత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… ఆర్విరెడ్డి గారు యు.ఎస్.లో వుంటారు. ఆయన శేషుతో కలిసి ఆర్.వి. బేనర్ స్థాపించారు. మళ్ళీ మళ్ళీ చూసే విధంగా సినిమాను తీశారు. అనూప్ రూబెన్స్ రావడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం కలిగిందని చెప్పారు.