విజయ్ దేవరకొండ సోదరుడు ‘‘దొరసాని’ హీరో ఆనంద్ దేవరకొండ నటించబోయే మూడో సినిమా తన మూడో సినిమాగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ కథను ఎంచుకున్నాడు. షార్ట్ ఫిలిం మేకర్ దామోదర అట్టాడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ మట్టపల్లి,ప్రదీప్ బెర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఈ సందర్భంగా…
నిర్మాతల్లో ఒకరైన విజయ్ మట్టపల్లి మాట్లాడుతూ.. ” షార్ట్ ఫిలింస్ తో ఆకట్టుకున్నమేకర్ దామోదర అట్టాడ ఓ మంచి కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీతో వచ్చాడు.ఈకథ హీరో ఆనంద్ దేవరకొండ కు బాగా సరిపో తుంది.కామెడీ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో ఆనంద్ లుక్ కూడా కొత్తగా ఉంటుంది.ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. త్వరలోనే పేర్లు ప్రకటిస్తాం.ఈ సినిమాతో ముగ్గురు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు. నవంబర్ లోరెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది ” అన్నారు.
సినిమాటోగ్రఫీ: మదన్ గుణదేవా,మ్యూజిక్: అమిత్ దాసాని,సిద్దార్థ్ సదాశివుని, రామ్ మిరియాల
ఆర్ట్: నీల్ ,నిర్మాతలు: విజయ్ మట్టపల్లి,ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర అట్టాడ