మన ఫిల్మ్ మేకర్స్ అందరి చూపు ఇప్పుడు ‘మహాభారతం’పై పడింది. తెలుగులో రాజమౌళి, మలయాళంలో సుకుమారన్, హిందీలో అమీర్‌ఖాన్ మహాభారతంపై సినిమాలు తీసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. హిందీలో ‘మహాభారతాన్ని తెరకెక్కించాలనేది తన డ్రీమ్’ అని అమీర్ ఖాన్ పలు సందర్భాల్లో తెలిపారు. ఈ చిత్రాన్ని తీయడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉందన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో కాస్త పురోగతి కనిపిస్తోంది….
ఈచిత్ర నిర్మాణంలో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ భాగం కాబోతున్నారట. దాదాపు వెయ్యి కోట్లతో ఈ సినిమాను నిర్మించాలని వారు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు వివిధ దర్శకులచేత నాలుగైదు పార్ట్‌లుగా సినిమా చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ రచయితల చేత కథ రాయిస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే మలయాళంలో వాసుదేవన్ నాయర్ రచించిన ‘రాందమూళం’ అనే నవల ఆధారంగా మహాభారతాన్ని తెరకెక్కించబోతున్నారు. మోహన్‌లాల్ భీముడి పాత్రలో నటిస్తున్నారు. కర్ణుడి పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారు. సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో ప్రారంభించి 2020లో విడుదల చేయనున్నారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.మహాభారతాన్ని తెరకెక్కించాలనే కోరిక మన దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్కూ ఉండటం గమనార్హం.