తప్పదు…ఈసారి హిట్ కొట్టి తీరాలి !

సినిమాలు వరుసగా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొడితే ..హీరోల స్టార్ ఇమేజ్ లో  తేడాలొచ్చేస్తాయి. కథల ఎంపికలో హీరోలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అందువల్లే  కొత్త ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లేందుకు సమయం పడుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్‌ విషయంలో కూడా ఇదే జరిగింది… ‘డీజే..దువ్వాడ జగన్నాథమ్‌’, ‘నా పేరు సూర్య’ చిత్రాలు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కానీ ఆ అంచనాలను చేరుకోలేకపోయాయి.‘డీజే..దువ్వాడ జగన్నాథమ్‌’ సక్సెస్ అంటూ ఎంత ప్రచార హోరెత్తించినా ఫలితం మాత్రం నిరాశ పరిచింది . ‘నా పేరు సూర్య’ గురించి చాలా గొప్పగా చెప్పినా.. పెద్ద  ఫెయిల్యూర్ గా మిగిలింది . దీంతో చాలా కాలం పాటు అల్లు అర్జున్‌ కొత్త సినిమాకు సంబంధించిన సమాచారం లేదు. దీంతో ఫ్యాన్స్‌ కూడా కొత్త సినిమా గురించి సామాజిక మాధ్యమాల్లో ఆరా తీశారు. దీనిపై బన్ని స్పందిస్తూ…”మంచి సినిమా గురించి ఎదురు చూస్తున్నా… కాస్త ఓపిక పట్టండి” అని ఫ్యాన్స్‌కు చెప్పాడు. దీనికి ముందు దర్శకుడు విక్రమ్‌ కుమార్‌తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే ఆ కథ ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. ఈ చిత్రంలో సెకండాఫ్‌ను సిద్ధం చేసే పనిలో విక్రమ్‌ ఉన్నారని ప్రచారం జరుగుతోంది
 
ఈ లోగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టుపై పాజిటివ్‌గా ఉన్నాడని ..ముందుగా అదే చేస్తాడని వార్తలొచ్చాయి. త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దసరా పండుగకు విడుదలకానుంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ నెక్స్ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. వెంకటేష్‌తో ఒక సినిమా లైన్‌లో ఉన్నప్పటికీ అది సెట్స్‌పైకి వెళ్లేందుకు మరికొంత సమయం పడుతుందట. దీంతో అల్లుఅర్జున్ త్రివిక్రమ్ వైపు చూస్తున్నాడు. ఈ స్టార్ డైరెక్టర్ అయితే తన ఇమేజ్‌కు తగ్గట్టు సినిమా చేయగలడని భావిస్తున్నాడు.
విక్ర‌మ్  పూర్తి  స్క్రిప్టు సిద్ధం !
క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కే కుమార్‌. అఖిల్ హీరోగా రూపొందించిన `హ‌లో` సినిమా ఫ‌లితం కొంత నిరాశ‌ప‌రిచింది. విక్ర‌మ్ ప్ర‌స్తుతం త‌న త‌ర్వాతి సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం మంచి స్క్రిప్టు చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా కేన్సిల్ అయిన‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అయితే అందులో నిజం లేద‌ని స‌మాచారం. బ‌న్నీ సినిమా కోసం విక్ర‌మ్ పూర్తి స్క్రిప్టును సిద్ధం చేశాడని, బ‌న్నీకి కూడా క‌థ న‌చ్చిందని వార్తలు వ‌స్తున్నాయి. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న‌ట్టు స‌మాచారం. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోయే సినిమాను బ‌న్నీ ప్రారంభిస్తాడ‌ట‌.
 
బన్నీకోసం మారుతి పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌
దర్శకుడు మారుతి. జెట్ స్పీడ్‌లో మీడియం రేంజ్ సినిమాలు తీర్చిదిద్దడంలో సిద్ధహస్తుడు. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ వంటి కామెడీతో కూడిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు మారుతికి మంచి విజయాల్ని అందించాయి. అయితే ఈసారి తన పంథా మార్చుకుని పూర్తిస్థాయిలో కమర్షియల్ బాట పట్టబోతున్నాడట మారుతి.
గీతా ఆర్ట్స్ సంస్థలో అల్లు శిరీశ్‌తో ‘కొత్త జంట’ చిత్రాన్ని తెరకెక్కించాడు మారుతి. ఈ చిత్రంతో నిర్మాత అల్లు అరవింద్ కూడా ఖుషీ అయ్యాడు. దీంతో అప్పట్లోనే అల్లు అర్జున్ కోసం కూడా ఓ సబ్జెక్ట్ సిద్ధం చేయాల్సిందిగా మారుతిని కోరాడట అరవింద్. అయితే మారుతి తన పద్ధతిలో.. పలు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ బన్నీకి వినిపించినా అవేమీ వర్కవుట్ కాలేదు. ఈనేపథ్యంలో ఇప్పుడు బన్నీకోసం ఓ పవర్‌ఫుల్ కమర్షియల్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేస్తున్నాడట. దానికి ముందే కమర్షియల్ టచ్‌తో నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అత్తా అల్లుడి కథతో పాత ఫార్ములాతో సరికొత్తగా కమర్షియల్ టచ్ ఇస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట మారుతి. ఈ సినిమా రిజల్ట్‌ని బట్టి.. బన్నీ ప్రాజెక్ట్‌పై పూర్తిస్థాయిలో దృష్టిపెడతాడట.