అల్లు అర్జున్… ఎట్టకేలకు తన కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడు. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి ఇప్పటికే చాలా గ్యాప్ తీసుకున్నాడు.వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే ..హీరోల ఇమేజ్ లో తేడాలొచ్చేస్తాయి. కథల ఎంపికలో హీరోలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అందువల్లే కొత్త ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లేందుకు సమయం పడుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా ఇదే జరిగింది… ‘డీజే..దువ్వాడ జగన్నాథమ్’ సక్సెస్ అంటూ ఎంత ప్రచార హోరెత్తించినా ఫలితం మాత్రం నిరాశ పరిచింది . ‘నా పేరు సూర్య’ గురించి చాలా గొప్పగా చెప్పినా.. పెద్ద ఫెయిల్యూర్ గా మిగిలింది . దీంతో చాలా కాలం పాటు అల్లు అర్జున్ కొత్త సినిమాకు సంబంధించిన సమాచారం లేదు. దీంతో ఫ్యాన్స్ కూడా కొత్త సినిమా గురించి సామాజిక మాధ్యమాల్లో ఆరా తీశారు. దీనిపై బన్ని స్పందిస్తూ…”మంచి సినిమా గురించి ఎదురు చూస్తున్నా… కాస్త ఓపిక పట్టండి” అని ఫ్యాన్స్‌కు చెప్పాడు. బన్నీ స్క్రిప్ట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావట్లేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ త్వరలో ఓ చిత్రంలో నటించబోతున్నారని గత కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. అయితే త్రివిక్రమ్ తో తన తదుపరి చిత్రాన్ని చేయటానికి బన్నీ ఆసక్తిచూపిస్తున్నాడు.
‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ ఎట్టకేలకు తన కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హిందీ సూపర్ హిట్ మూవీ ని రీమేక్ చేయనున్నాడట. అయితే త్రివిక్రమ్ మరో కథను కూడా వినిపించడానికి సిద్ధమవుతున్నాడట. ఈరెండు కథల్లో ఏదో ఒకటి ఫైనల్ చేసి డిసెంబర్ నుండి సెట్స్ మీదకు తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.బన్నీ కి త్రివిక్రమ్ తో ఇది మూడో సినిమా ఇంతకుముందు వీళ్లిద్దరి కలయికలో ‘జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి’ చిత్రాలు వచ్చాయి. ఇక ‘అరవింద సమేత’ చిత్రంతో హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ బాట పట్టాడు త్రివిక్రమ్.
విక్రమ్ తో సినిమా చెయ్యటం ఖాయం
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ, త్వరలో ఓ చిత్రంలో నటించబోతున్నారని గత కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే త్రివిక్రమ్ తో తన తదుపరి చిత్రాన్ని చేయటానికి బన్నీ ఆసక్తి
చూపిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక బన్నీతో విక్రమ్ కుమార్ సినిమా ఉండదు అనుకున్నారు అంతా.అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం విక్రమ్ కుమార్ చెప్పిన కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. కాకపోతే కథలో కొన్ని మార్పులు చెయ్యమని చెప్పారని, స్క్రిప్ట్ పకడ్బంధీగా ఉండేలా చెయ్యమని కోరారని తెలుస్తోంది. దీన్ని బట్టి బన్నీ త్వరలో విక్రమ్ తో సినిమా చెయ్యటం ఖాయంగా కనిపిస్తోంది. కాకపొతే అది త్రివిక్రమ్ సినిమా తరువాతనే కావచ్చని అనుకుంటున్నారు.