ఆ చిత్రం తెరకెక్కాలంటే భారీ బడ్జెట్ !
అల్లు అర్జున్ తన కుటుంబంతో విహార యాత్రకు వెళ్లి తిరిగొచ్చేశారు. ‘నా పేరు సూర్య’ తర్వాత విహార యాత్ర నిమిత్తం ప్యారీస్‌కు వెళ్లే ముందు విక్రమ్ కుమార్ ఓ కథను చెప్పారట. నవల తరహాలో ఉండే ఆ కథ విన్నవెంటనే బన్ని ఆశ్చర్యానికి గురయ్యాడట. ఆ చిత్రం తెరకెక్కాలంటే భారీ బడ్జెట్ అవసరమవుతుందట. సుమారుగా వంద కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత బడ్జెట్లో సినిమా చేస్తే అల్లు అర్జున్ కెరీర్లో ఇదే భారీ బడ్జెట్ చిత్రమవుతుంది. ఇప్పటి వరకూ బన్నికి అత్యధికంగా 60 కోట్లతో తీశారు. వంద కోట్లతో ఆయన హీరోగా సినిమా అంటే కాస్త ఆలోచిస్తారు. ఆ సందేహాన్నే బన్ని కూడా విక్రమ్ వద్ద వ్యక్తం చేశారట. చెప్పిన కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే 70 నుంచి 80 కోట్ల మధ్యలో తీసేయొచ్చునని చెప్పారట దర్శకుడు. గీతాఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్‌మాస్టర్స్ పని చేయాల్సి ఉంటుంది.
సీక్వెల్ కు అవకాశం ఉంది !
టాలీవుడ్లో మరో సీక్వెల్ రాబోతుందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ‘రేసు గుర్రం’ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడబోతుందన్నది ఆ కథనం సారాంశం. 2014లో వచ్చిన రేసు గుర్రానికి సురేందర్ రెడ్డి డైరెక్టర్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్ కు అవకాశం ఉందని సురేందర్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు.