అలీ సమర్పణలో అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీబాబ, కొణతాల మోహన్‌కుమార్, శ్రీ చరణ్ ఆర్.లు సంయుక్తంగా నిర్మించిన ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అక్టోబర్ 28న ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ‘వికృతి’ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్ చేసిన యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. ఈ చిత్ర ట్రైలర్, టీజర్‌ను ఘనంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, బ్రాహ్మానందం చేతుల మీదుగా చిత్ర ట్రైలర్, టీజర్ ను లాంచ్ చేశారు.
దర్శ కులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ టైటిల్ వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో మలయాళం లో చూసిన “వికృతి” సినిమా నచ్చి తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో తనే నిర్మాతగా మారి సీనియర్ నటులందరితో తీసిన ఈ సినిమాకు కొత్త దర్శకుడిని, మ్యూజిక్ డైరెక్టర్‌ను పరిచయం చేయడం గొప్ప విషయం.మేము ఆలీ తో తీసిన బ్లాక్ బస్టర్ ‘యమలీల’ నెక్ట్స్ ఇయర్‌కు 30 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆలీ ఇప్పటికీ ఫ్రెష్ గా ఉన్నాడు. నటుడుగా వేయి చిత్రాలకు పైగా నటించిన ఆలీ ఈ చిత్రం ద్వారా సొంత బ్యానర్ పెట్టి సినిమా నిర్మించే స్థాయికి ఎదిగడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ… బాల నటుడుగా ఇండస్ట్రీకి వచ్చి అంచె లంచెలుగా ఎదిగి 1200 సినిమాలలో నటించడం గొప్ప విషయం. ఇలా ఇన్ని సినిమాలు చేసిన బ్రహ్మానందం కూడా ఈ వేదికపై ఉండడం విశేషం. మనసుకు హత్తుకునే మంచి కథను సెలెక్ట్ చేసుకుని తన బ్యానర్ లో తెరకేక్కిస్తున్న ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది.ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడవలసిన “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి” సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ… నేను, అలీ ఒకే టైమ్‌లో కేరీర్ స్టార్ట్ చేశాము. అలీ, నేను కలసి చూసిన మెదటి సినిమా ‘మనీ’. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గార్లు యమలీల సినిమా ద్వారా ఆలీని హీరోగా పరిచయం చేశారు. అప్పట్లో అది ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఆలా ఎదుగుతూ వచ్చిన ఆలీ ఈ రోజు మంచి సబ్జెక్టును సెలెక్ట్ చేసుకొని, చాలా మంది సీనియర్ నటులతో తీసిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.
నటుడు నిర్మాత ఆలీ మాట్లాడుతూ.. మలయాళం లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నరేష్ గారు నేను పోటాపోటీగా నటించాము .27 ఏళ్ల తరువాత మంజు భార్గవి గారితో కలిసి మళ్ళీ నటించడం ఆనందంగా ఉంది. ఒక మంచి వాతావరణంలో దాదాపు అందరూ సీనియర్ ఆర్టిస్ట్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ కిరణ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. అందరు టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం కష్టపడి పనిచేస్తున్నారు, ఇందులో నటించిన వారందరూ ఎంతో సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. ఈ నెల 28న ఆహా లో విడుదల అవుతున్న ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర నిర్మాత కొణతాల మోహన్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కథకు ఈ టైటిల్ కరెక్ట్ యాప్ట్ అని పెట్టాము. ఇలాంటి సినిమా చేసే అవకాశం కల్పించిన ఆలీ గారికి ధన్యవాదాలు .మేము అడిగిన వెంటనే నటించడానికి అంగీకరించిన నటీ నటులు అందరికీ ధన్యవాదాలు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి” సినిమా అందరితో ఆహా అనిపించుకుంటుందని అన్నారు.
‘ఆహా’ తరుపున వచ్చిన బాలబొమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మలయాళంలో విజయం సాధించిన ‘వికృతి’ మూవీని తీసుకుందామని ఆ చిత్ర నిర్మాతను అడిగితే.. అది అప్పుడే వేరే వారు తీసుకున్నారు అని చెప్పడంతో కొంత బాధ అనిపించింది. తీరా చూస్తే నేను కావాలనుకున్న అదే సినిమా ఇప్పుడు ఆహా కు రావడం చాలా సంతోషం వేసింది అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ… 1200 సినిమాలు చేసిన అలీ గారు మొదటి సారి నిర్మాతగా మారి చేస్తున్న ఈ సినిమాకు నేను దర్శకుడు అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఎంతో మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నా.. అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు.ఎస్.మురళి మోహన్ రెడ్డి కెమెరా వర్క్, రాకేశ్ పళిడమ్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ. ఇలా అందరి సహకారంతో పూర్తి చేసుకొన్న ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వాదంచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
నటీ నటులు:
తనికెళ్ళ భరణి, అలీ, నరేశ్, మౌర్యానీ, పవిత్ర లోకేశ్, సన, మంజు భార్గవి, శివ బాలాజీ, పృద్వీ, రామ్ జగన్, భద్రం, తదితరులు