నా వ్యక్తిగత విషయాలన్నీ యూట్యూబ్‌లోనే !

“తన వ్యక్తిగత జీవితం గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోవాలంటే యూట్యూబ్‌ ఛానల్‌ చూడాలని” …బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ చెబుతోంది. ఈమె సినిమాలు, ఇతర విషయాలపై నిత్యం ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తూనే ఉంటుంది. అయినా ఆలియా సంతృప్తి చెందలేదు. తన వ్యక్తి జీవితం గురించి ఇంకా సవివరంగా చెప్పడం కోసం ఓ మాధ్యమం ఉండాలని నిర్ణయంచుకుందట ఆలియా. అందుకే దానికి యూట్యూబ్‌ను వేదికగా మార్చుకుంది. తనను, తన మనసును ఆ ఛానల్‌లో ఆవిష్కరిస్తుందట. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఒడపోత పోసిన సమాచారాన్ని మాత్రమే ఉంచుతున్నట్టు వెల్లడించింది. ఇక నుంచి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రతి విషయాన్నీ యూట్యూబ్‌లో ఫ్యాన్స్‌తో పంచుకోనుందట. అందుకోసం యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించి తన తొలి వీడియోలో కూడా ఇదే విషయాన్ని వివరించింది ఆలియా.యూట్యూబ్‌లో అయితే అన్ని విషయాలూ సవివరంగా ఉంటాయని చెప్పింది.
“త్వరలోనే తాను సింగర్‌ కాబోతున్నానని, ఓ పాట పాడతాన”ని చెబుతూనే ఆ పాట ఎక్కడ ఎప్పుడు? పాడేది అన్న వివరాలు మాత్రం వెల్లడించనని స్పష్టం చేసింది. ‘నాకు పాట అంటే ప్రాణం…పాడడం అంటే ఇష్టం. ప్రేక్షకులే నాకు స్టూడియో అని భావిస్తా. ప్రేమ గేయాలు కానివి మాత్రం పాడతా. గానం చేయడం కోసం చాలా తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నా” అని చెప్పింది ఆలియా భట్‌.
 
ఏదో ఓ రోజు అక్కడికి వెళ్తా !
ఆలియా భట్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి దాదాపు ఏడేళ్లు పూర్తికావోస్తున్నాయి. స్టార్ల కుటుంబం నుంచి వచ్చిన ఆలియా. రాజీ, హైవే లాంటి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుని తోటి హీరోయిన్‌లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో త్వరలోనే టాలీవుడ్‌ ప్రేక్షకులని కూడా పలకరించనుంది.ఈ క్రమంలో కొత్త ఇండస్ట్రీలో నటించడం ఎలా ఉందని ఆలియాను ప్రశ్నించగా.. ‘కొత్త పరిశ్రమకు చెందిన ప్రజలను ఎంటర్‌టెయిన్ చెయ్యడం.. వారి మెప్పు పొందడం కాస్త కష్టమైన పనే. కానీ నా వరకూ నేను వంద శాతం కష్టపడతాన’ని తెలిపారు. హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తారా? అని ప్రశ్నించగా.. ‘ఏదో ఓ రోజు నేను అక్కడికి వెళ్తానని నా నమ్మకం. కానీ అందుకు మరి కొంత సమయం వేచి ఉండక తప్పదు. దాని కోసం నేను మరింత కష్టపడాలి’ అని చెప్పుకొచ్చారు.