అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మరోపాట విడుదల

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ కాంబినేషన్ లో ‘అల వైకుంఠపురములో…’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా. అందుకే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, “రాములో రాముల” పాటలు చిత్రం పై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి.
సంగీత దర్శకుడు థమన్ స్వరపరచిన ఈ చిత్రం లోని మరోగీతం ‘ఓ డాడీ’ ఈరోజు విడుదలైంది. గీత రచయిత కృష్ణ చైతన్య ఈ పాట రాసారు. ఈ పాటలో వచ్చే తెలుగు ర్యాప్ కూడా ఆయనే రాయడం విశేషం. తెలుగు ర్యాప్ ని ‘బిగ్ బాస్’ ఫేమ్ రోల్ రైడా పాడగా.. ఇంగ్లీష్ ర్యాప్ ని రాహుల్ నంబియార్ పాడారు. ఫిమేల్ ర్యాప్ ని లేడీ కాష్ పాడింది. ‘బిగ్ బాస్’ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను తన స్టయిల్ లో పాడి ఉర్రూతలూగించారు.. బ్లాజీ ఈ పాటకు గాత్ర సాయం చేశారు.’ఓ డాడీ’ గీతం విడుదలైన కొద్ది సమయానికే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
 
అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,
పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటీ నటులు .
 
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్, నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)