“నెలకు మూడు వేలకు మించి నా పాకెట్ మనీ ఖర్చు కాదు”…అని అక్షయ్ కుమార్ షాకింగ్ న్యూస్ చెప్పారు. ‘కపిల్ శర్మ కామెడీ నైట్స్’కు హాజరైన అక్షయ్ కుమార్.. తన నెలసరి ఖర్చు పది వేల రూపాయల లోపే ఉంటుంది. ఎక్కువంటే మూడు వేలకు మించి నా పాకెట్ మనీ ఖర్చు కాదు. నేను మద్యం సేవించను. సిగరెట్లు తాగను. షూటింగులకు వెళ్తే నిర్మాతే నా ఖర్చంతా భరిస్తారు. ఇక నాకు ఏం ఖర్చు ఉంటుంది చెప్పండి.. అంటూ అక్షయ్ కుమార్ చెప్పారు. ఇక ఫ్యామిలీకి అత్యంత ప్రధాన్యత ఇచ్చే అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నాతో అన్యోన్యంగా ఉంటారు.
ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొంటా!
బాలీవుడ్ హీరో, హీరోయిన్లు అంటే అర్ధరాత్రి వరకు పార్టీలు, పబ్‌లతో ఎంజాయ్ చేస్తారని తెలిసిందే. అయితే, అక్షయ్ కుమార్ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. పార్టీలకు,పబ్‌లకు, ఆరోగ్యం, ఆహార నియమాలను వందశాతం పాటించేందుకు ప్రయత్నిస్తారు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటారు. రాత్రి 9.30 నుంచి 10 గంటల మధ్యలో నిద్రకు ఉపక్రమిస్తాను. ఉదయమే లేచి వర్కవుట్లు చేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యమనే విషయాన్ని బలంగా నమ్ముతాను.అక్షయ్ కుమార్ దినచర్య షూటింగ్ ఉన్నా లేకున్నా..ఉదయం 4 గంటలకే ప్రారంభం అవుతుంది. సాధారణంగా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ సమయానికి పార్టీల నుంచి తిరిగి వచ్చి నిద్రకు ఉపక్రమిస్తారు. అక్షయ్ జాగింగ్‌కు వెళ్తున్న సమయంలో చాలా మంది హీరో, హీరోయిన్లు పార్టీల నుంచి తిరిగి వస్తూ ఆయనకు ఎదురుపడుతారట. “షూటింగులకు లేటుగా వెళ్లడం వల్ల నిర్మాతకు, ఇతర నటీనటులకు ఇబ్బందిగా కలుగుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొంటాను” అని అక్షయ్ కుమార్ చెప్పారు.
డబ్బు విలువ నాకు తెలుసు!
ప్రతీ సినిమాకు కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్‌గా అందుకొంటావు. ఆ డబ్బులన్నీ ఏం చేస్తావు అని కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు.. నా సేవింగ్స్ అకౌంట్‌లోనే ఉంటాయి. ఏదైనా విపత్కర పరిస్థితుల్లో మంచి పనుల కోసం ఉపయోగిస్తాను. పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతాను. డబ్బు విలువ నాకు తెలుసు. దానిని దుర్వినియోగం చేయడం ఇష్టం ఉండదు అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.
కరోనా కోసం విరాళం 28 కోట్లు!
ప్రధాని మోదీ పిలుపు మేరకు స్పందించి.. కరోనాపై పోరాటానికి భారీ విరాళాన్ని అందించారు. కరోనా బాధితులను ఆదుకోవడానికి 25 కోట్ల రూపాయలను తన సేవింగ్స్ ఖాతా నుంచి ప్రధాని ఏర్పాటు చేసిన నిధికి మళ్లించారు. అంతే కాకుండా సినీ కార్మికుల కోసం మరో 3 కోట్లు ఇచ్చారు. అక్షయ్ కుమార్ ఇచ్చిన విరాళం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ప్రజలేప్పుడు సినిమా హీరోలని ఒక వయస్సు వరకు హీరోలుగా భావిస్తుంటారు.ఆ తరువాత వారి గురించి పెద్దగా పట్టించుకోరు.బాగుంటే వెళ్లి సినిమా చూస్తారు. హోటల్లో కుక్ గా జీవితం ప్రారంభించిన అక్షయ్ కుమార్ కు జీవితపు విలువలు తెలుసు. సమాజం పట్ల బాధ్యత తెలుసు. అతని సినిమాలు చూసినప్పుడు మనకు అర్థమౌతుంది. ఈ రోజు అతను నిజమైన హీరో. ప్రజలనుండి తనకు వచ్చిన డబ్బు ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికే ఇచ్చేశాడు.
అదే వారు చేసే అతిపెద్ద మేలు!
బాధ్యతాయుతంగా సినిమాలు తీసేవారు సినిమా పరిశ్రమలో ఉన్నారు.అయితే కొందరు .. చూపించకూడనవి చూపించి చివర్లో ‘ఇది మంచిది కాదు’ అని చెప్పడం ఎంతవరకు సబబు? హింస, ధూమ,మద్యపానాలు సినిమాలలో చూపించే దర్శకులు,రచయితలు సమాజానికి పట్టిన చీడపురుగులే. అదేమంటే బయట సమాజంలో ఇంతకంటే ఎక్కువున్నాయి అని చెబుతారు. ఉంటే ఉండొచ్చు కానీ చెడుని ప్రచారం చెయ్యాల్సిన అవసరం లేదుగా! సినిమా, టివి,నాటకం ఏదైన సరే. సీరియల్స్ వల్ల ఇటీవల కాలంలో నేరప్రవృత్తి పెరిగినట్లు రుజువైంది. సమాజం పట్ల వీరందరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కరొనా 2,3 సంవత్సరాల వరకు సినిమాలపై ప్రభావం చూపుతుంది. థియేటర్ కి వెళ్లి ప్రేక్షకుడు సినిమా చూడడం ఇప్పట్లో కొంచం కష్టమే. ఆన్ లైన్ లో సినిమాలు చూడడం ఎక్కువ అవుతుంది. యువత కోసం సినిమాలు అనే ఆలోచన మార్చుకోవాలి. సినిమా తీసేవాళ్ళు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని సినిమాలు తియ్యాలి. అదే వారు సమాజాన్ని చేసే అతిపెద్ద మేలు.