అక్రమ్ సురేష్ హీరోగా రాజధాని అమరావతి మూవీస్ బ్యానర్ లో భారీ మాస్ యాక్షన్ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఓ షెడ్యూల్, 2 పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. హాలీవుడ్ రేంజులో తెరకెక్కుతున్న చిత్రమిది. హీరో అక్రమ్ పుట్టినరోజు సందర్భంగా రాణా పాత్ర లుక్ ని సీనియర్ హీరో సుమన్ లాంచ్ చేశాం. రామోజీ ఫిలింసిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో సమర్పకుడు విస్సాకోటి, శివకుమార్ ఇతర టీమ్ పాల్గొన్నారు.
దర్శకనిర్మాతలు మాట్లాడుతూ-“డాన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాక్, రాణా, అక్రమ్, రాణా ప్రతాప్ సింగ్ అనే నాలుగు గెటప్పుల్లో హీరో నటిస్తాడు.నాలుగు స్టైలిష్ గెటప్పులతో ప్రేక్షకుల్ని కథానాయకుడు మంత్రముగ్ధం చేస్తాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్ .. చిన్నా పెద్దా అందరికీ నచ్చే చిత్రమిది. సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటి అక్కినేనికి నట సామ్రాట్ బిరుదును ఇచ్చారు. తాజా చిత్రంలో అక్రమ్ సురేష్ గెటప్ చూసి టాలీవుడ్ తలైవా అనే బిరుదును ఇచ్చారు. భారీ సెట్ లో చిత్రీకరించిన ఇంటర్వెల్ సీన్ హైలైట్. 40 సినిమాల అనుభవజ్ఞుడిగా హీరో నటించాడు. కథానుసారం అద్భుతమైన నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది మోస్ట్ స్టైలిష్ యాక్షన్ సినిమా.. డాన్ ల సినిమాల్లోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. అత్యంత ఖరీదైన కార్లను, దిగుమతి చేసిన బైక్ లను ఉపయోగించారు. త్వరలో రాక్ లుక్‌ని, ఉగాదికి టీజర్ ని రిలీజ్ చేస్తాం“ అని అన్నారు.
పోసాని, సుమన్, లిపికా తదితరులు నటించారు. దిల్లీ భామ ఖుషీ కథానాయికగా పరిచయం అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం:ఎం.యు.సాయి, ఎడిటింగ్: గౌతం రాజు, కెమెరా: అనీల్, కథ-కథనం-డైలాగ్స్-దర్శకత్వం: సురేష్ మేడిది.