‘ప్రేమమ్’, ‘రారండోయ్’ వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన డిఫరెంట్ థ్రిల్లర్ కథా చిత్రం ‘యుద్ధం శరణం’. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా కృష్ణ ఆర్.వి. మారిముత్తుని దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి చలన చిత్రం బేనర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ‘యుద్ధం శరణం’ చిత్రం సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. శ్రీకాంత్ పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించిన మైండ్ గేమ్స్‌తో, డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీస్, ఫ్యాన్స్‌కి నచ్చేవిధంగా రూపొందింది. ఈ సందర్భంగా నాగచైతన్యతోఇంటర్వ్యూ…..
ఈమధ్య కాలేజ్ స్టూడెంట్స్‌ని కలవడం ఎలా అన్పించింది?
– చాలా బాగుంది. ఈ సినిమా మెయిన్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. అందుకని రిలీజ్‌కి ముందే ఈ సినిమా గురించి అందరికీ తెలియజెప్పడానికి కొన్ని కాలేజెస్‌కి వెళ్లి స్టూడెంట్స్‌ని కలవడం జరిగిందది. ముఖ్యంగా ఈ సినిమాకి వారి సపోర్ట్ కావాలి. అందుకే ఓపెన్‌గా వెళ్లి అందర్నీ కలిసాం. ప్రతి ఒక్కరూ మంచి ఎనర్జీ ఇచ్చారు. మెయిన్‌గా భీమవరం ఉమెన్స్ కాలేజ్‌కి వెళ్ళినప్పుడు చాలా క్రేజీగా అన్పించింది. అంతకుముందు కాలేజ్‌కి వెళ్ళి గేటు ముందు నిలబడి వెయిట్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైమ్ కాలేజ్ లోపలికి వెళ్ళగానే చాలా థ్రిల్‌గా అన్పించింది. ఆ ఎట్మాస్ఫియర్ చాలా కొత్తగా వుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. హెవీ క్రౌడ్స్తో అమ్మాయిల్ని చూడగానే నాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందా అన్పించింది. ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకున్నారు. వారందరితో కలిసి మాట్లాడటం చాలా హ్యాపీగా వుంది.
థ్రిల్లర్ కథాంశాన్ని ఎంచుకోవడానికి రీజన్?
– ఫస్ట్ టైమ్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా చేశాను. బట్ థ్రిల్లర్ అయినా కూడా సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. లవ్‌స్టోరి. మంచి ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు కామెడీ కూడా వుంటుంది. స్క్రీన్‌ప్లే థ్రిల్లర్ ఫార్మెట్లో వుంటుంది. ఎవ్విరి మినిట్ ఓ కొత్త ట్విస్ట్ వుంటుంది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ చాలా ఎగ్జైటెట్‌గా సినిమా వుంటుంది.
యాక్షన్ పార్ట్ ఎంతవరకు వుంటుంది?
– క్లైమాక్స్‌లో శ్రీకాంత్‌తో ఓ ఫైట్ సీక్వెన్స్ వుంటుంది. అది సినిమాకి హైలైట్‌గా వుంటుంది. దాంతో పాటు సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ వుంటాయి. అవి ఎక్కువ ప్రొజెక్ట్ చేయడం లేదు. సినిమా అంతా బ్రెయిన్ ఇంటెలిజెంట్ ప్లేలో రన్ అవుతుంది.
ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది?
– డైరెక్టర్ కృష్ణ నా క్లోజ్ ఫ్రెండ్. లాస్ట్ ఒన్ ఇయర్ నుండి ఈ స్క్రిప్ట్ పైన వర్క్ చేస్తున్నాడు. నా క్యారెక్టర్ని డిఫరెంట్‌గా డిజైన్ చేసి సబ్జెక్ట్‌ని ఇంప్రవైజ్ చేశాడు. సినిమా అంతా 65 డేస్‌లో కంప్లీట్ చేసి వెల్ ప్లాన్డ్గా వర్క్ చేశాం. ప్రీ ప్రొడక్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ వర్క్ చేయడం జరిగింది. ఈ కథ నాకు, సాయిగారికి బాగా నచ్చింది. సో.. అలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది.
డైరెక్టర్ కృష్ణ మీ ఫ్రెండ్ అని ఛాన్స్ ఇచ్చారా? లేక డైరెక్టర్ అవుతాడనా?
– డైరెక్టర్ అవుతాడని నమ్మకంతోనే ఈ సినిమా ఛాన్స్ ఇచ్చాను. నాకు ఎప్పట్నుంచో ఒక డ్రీమ్ వుంది. ఫ్రెండ్‌తో కలిసి ఒక సినిమా చెయ్యాలని ఏ వర్క్తోనైనా బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి పని చేస్తే ఆ రిజల్ట్, ఔట్పుట్ వేరేలా వుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో వచ్చింది. కృష్ణ వేరే దర్శకుల వద్ద ఐదు సంవత్సరాలు వర్క్ చేసి చాలా స్ట్రగుల్ పడ్డాడు. ‘యుద్ధం శరణం’ స్క్రిప్ట్ మా అందరికీ నచ్చింది. ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ సింక్ అయ్యారు. కాబట్టి ఈ సినిమా టేకాఫ్ అయ్యింది.
నిర్మాత సాయి కొర్రపాటి మేకింగ్ ఎలా వుంది?
– సాయిగారు న్యూ కామర్స్‌కి ఇచ్చే ఎంకరేజ్మెంట్కి హ్యాట్సాఫ్. ఈ సినిమా 80 శాతం వరకు అందరూ కొత్తవాళ్ళే వర్క్ చేశారు. స్టోరీస్ నచ్చి కరెక్ట్ జడ్జిమెంట్‌తో సినిమాలు తీస్తారు ఆయన. కొత్తవాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఇండస్ట్రీకి గ్రో అవుతూ వుంటుంది. కొత్త కంటెంట్ వస్తుంది. సాయిగారిలాంటి ప్రొడ్యూసర్స్ వుండాలి. డేర్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం మాములు విషయం కాదు. సాయిగారితో ఈ సినిమా చేయడం రియల్లీ సూపర్బ్. ఈ సబ్జెక్ట్ వినగానే దీనిని పెద్ద స్కేల్లో చేద్దాం అని శ్రీకాంత్గారిని, రావు రమేష్, రేవతిగార్లను అందర్నీ అప్రోచ్ అయి ఈ చిత్రాన్ని మేం అనుకున్న దాని కంటే బిగ్ స్కేల్లో నిర్మించారు.
శ్రీకాంత్‌గారితో వర్క్ చేయడం ఎలా వుంది?
– శ్రీకాంత్‌గారితో పని చేయడం చాలా చాలా ఆనందంగా వుంది. ఆయన నెగిటివ్ రోల్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుంది. నా క్యారెక్టర్‌కి కూడా మంచి ఎలివేషన్ ఇచ్చారు.
లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ గురించి?
– లావణ్య చాలా రియలిస్టిక్‌గా నటించింది. కంటెంట్ వున్న రోల్స్‌నే తను యాక్సెప్ట్ చేసి చేస్తుంది. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయరు. ఈ సినిమాలో త్రో ఔట్ క్యారెక్టర్లో నటించింది. సెకండాప్లో నన్ను బాగా సపోర్ట్ చేసే క్యారెక్టర్ అది. ఫెంటాస్టిక్‌గా చేసింది.
ఈ సినిమాకి ఎక్కువ నైట్‌లో షూటింగ్ చేశారని తెల్సింది?
– థ్రిల్లర్ జోనర్ కాబట్టి సినిమా అంతా ఒక్కరోజులో అయిపోతుంది. అందుకే రియలిస్టిక్‌గా అప్రోచ్ అవ్వాలని చాలా వరకు రాత్రి పూట వర్క్ చేశాం. ఆ ఎఫెక్ట్స్ క్లియర్‌గా రావడానికి ట్రై చేశాం.
ఈ సినిమా చూశాక మీకుఎలాంటి ఫీలింగ్ కలిగింది?
– రెగ్యులర్ ఫిలింస్లా కాకుండా చాలా కొత్తగా వుంటుంది. డెఫినెట్‌గా తెలుగు ప్రేక్షకులకి, ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. కంటెంట్ వైజ్, స్క్రీన్‌ప్లే వైజ్‌గా ప్రతిది చాలా కొత్తగా వుంటుంది. ఈ సినిమాలో డ్రోన్ అని ఒక కొత్త పరికరాన్ని వాడాం. చాలా మంది గవర్నమెంట్ అధికారులు డిఫెన్స్‌లో, మీడియాలో దీనిని వాడతారు.
మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది?
– ఈ సినిమాలో నేను ఒక డ్రోన్ మేకర్ని. ఆ డ్రోన్‌ని ఒక క్యారెక్టర్లా డిజైన్ చేశాం. సినిమాలో ఆ డ్రోన్ క్యారెక్టర్ కూడా త్రూ ఔట్ రన్ అవుతుంది. యూత్‌కి ఇది చాలా కొత్తగా వుంటుంది. ప్రతి ఒక్కరూ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు.
ముఖ్య పాత్రల గురించి?
– రావు రమేష్, రేవతి గారి క్యారెక్టర్స్ మెయిన్ హైలైట్‌గా వుంటాయి. అలాగే మురళీశర్మగారు పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. చాలా హ్యూమరస్‌గా ఆయన క్యారెక్టర్ వుంటుంది. సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఆడియెన్స్‌కి కొత్తగా అన్పిస్తుంది. ఇలాంటి స్క్రీన్‌ప్లే ఎప్పుడూ చూసి వుండరు.
లైన్ ప్రొడ్యూసర్ కార్తికేయ గురించి?
– ఈ ప్రాజెక్ట్‌కి లైన్ ప్రొడ్యూసర్‌గా కార్తికేయ చేశాడు. అలాగే ఈ సినిమాకి అందరూ 30 ఏళ్ళ వయసువారే వర్క్ చేశారు. ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగుండింది. డైరెక్టర్‌కి ఏం కావాలి? ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ని ఎలా మెయిన్టైన్ చేయాలి అని అందర్నీ కేర్‌ఫుల్‌గా చూసుకుంటూ ప్రతి ఒక్కర్నీ శాటిస్ఫై చేశాడు. స్క్రిప్ట్ బాగా నచ్చి ఈ సినిమాకి కార్తికేయ చాలా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశాడు.
‘యుద్ధం’, ‘శరణం’ ఎవరితో?
– ‘యుద్ధం’ శ్రీకాంత్‌గారితో, ‘శరణం’ నా ఫ్యామిలీతో
ఇంతకీ మీ పెళ్ళెప్పుడు?
– అక్టోబర్ 6న గోవాలో తెలుగు సాంప్రదాయ పద్ధతిలో జరుగుతుంది. 7న క్రిస్టియన్ మ్యారేజ్ వుంటుంది. రిసెప్షన్ అనేది హైదరాబాద్‌లో నాన్నగారు చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.
నెక్ట్స్ మూవీస్?
– చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో ‘సవ్యసాచి’ మూవీ చేస్తున్నాను. తాతగారి బర్త్‌డే సెప్టెంబర్ 20న ఆ సినిమా ప్రారంభం అవుతుంది. కంప్లీట్ పక్కా కమర్షియల్ సినిమా అది. సినిమా ఎప్పుడెప్పుడు చెయ్యాలా అని చాలా ఎగ్జైటెడ్‌గా వుంది. తర్వాత మారుతి దర్శకత్వంలో చినబాబుగారి సినిమా వుంటుంది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.