శివ కంఠంనేని ‘అక్కడొకడుంటాడు’… చిత్రానికి చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోందని ఆ చిత్రబృందం వెల్లడించింది. శివ కంఠంనేని టైటిల్ పాత్రలో రామ్ కార్తీక్, శివహరీష్, అలేఖ్య, రసజ్ఞదీపిక హీరోహీరోయిన్లుగా శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో లైట్ హౌస్ సినీమ్యాజిక్ పతాకంపై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో జరిగిన సక్సెస్ మీట్లో…
టైటిల్ పాత్రధారి శివ కంఠంనేని మాట్లాడుతూ… ఈ చిత్రానికి రివ్యూస్ రేటింగ్ చాలాాబాగా రావడం మా అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు బావున్న సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిత్రం విడుదలైన మొదటి రెండు రోజులు కలెక్షన్లు సాధారణంగా ఉన్నామౌత్ టాక్ తో ఆదివారం నుంచి కలెక్షన్లు బాగా పెరిగాయి. భారతీయుడు, అపరిచితుడు చిత్రాల కోవలో అండర్ కరెంట్ గా డ్రంకన్ డ్రైవ్ పైన సందేశం ఉంటుంది తప్ప ఇది పూర్తి కమర్షియల్ చిత్రం. థియేటర్ల పరంగా సి.కల్యాణ్ మాకు ఎంతో సహకరించారు. దానివల్లే మాకు మంచి థియేటర్లు లభించాయి అని అన్నారు.
దర్శకుడు శ్రీపాద విశ్వక్ మాట్లాడుతూ… కొత్తదనానికి పట్టంకడుతున్న నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీసిన చిత్రమిది. చిత్రం చివరి వరకూ సస్పెన్స్ కొనసాగుతూ ప్రేక్షకులకు థ్రిల్ ను కలిగిస్తోంది. మేము ఏదైతే చిత్రం గురించి అనుకున్నామో దానికి చేరువయ్యాం అని అన్నారు.
నిర్మాతలలో ఒకరైన రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… మా బేనర్లో చేసిన మొదటి ప్రయత్నమిది. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ రివ్యూస్ కు మంచి రేటింగ్ రావడం మాకు ఆనందాన్ని ఇస్తోంది. సినిమా ఆరంభం నుంచి చివరి సన్నివేశం వరకు ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను కూర్చుండ పెడుతోంది. ఇదే మా సక్సెస్ అని అన్నారు.
హీరోలలో ఒకరైన శివహరీష్ మాట్లాడుతూ… ఇలాంటి పూర్తిస్థాయి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నటించడం ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పగా…పాత్రలకు తగ్గ చక్కటి నటీనటులు ఈ చిత్రానికి కుదిరారని కథానాయికలలో ఒకరైన అలేఖ్య పేర్కొన్నారు. మరో కథానాయిక రసజ్ఞదీపిక మాట్లాడుతూ, పేరు తెచ్చిపెట్టే మంచి పాత్రలో నటించడం గొప్ప అనుభూతినిచ్చిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ దాసరి శ్రీనివాస్, చిత్ర నిర్వాహకులు ఘంటా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.