యూత్ కింగ్ అఖిల్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఫ్యామిలీ, రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘హలో’. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్ పొందింది. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 20న హీరో అఖిల్ సహా యూనిట్ సభ్యులందరూ డిసెంబర్ 20న స్పెషల్ ప్రమోషనల్ షోను హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవుతారు.
అఖిల్ యు.ఎస్. టూర్ గ్రాండ్ సక్సెస్
‘హలో’ ప్రమోషన్స్‌లో భాగంగా యు.ఎస్ టూర్లో న్యూజెర్సీ, సాన్‌జోస్, డల్లాస్‌లలో యూత్ కింగ్ అఖిల్, హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్తోపాటు మరో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి పాల్గొని ప్రేక్షకులను థ్రిల్ చేశారు. ఆడియెన్స్‌ను పలకరిస్తూ వారితో ఆడి పాడారు. ముఖ్యంగా హీరో అఖిల్ యూనిట్‌తో కలిసి… హలో సినిమాలోని పాటలు పాడుతూ, లైవ్‌లో చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. హీరో రానా దగ్గుబాటి.. వ్యాఖ్యాతగా వ్యవహరించి యూనిట్ సభ్యులకు ఎనర్జీని అందించారు. షో సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కావడంలో తన వంతు పాత్రను పోషించారు. యు.ఎస్‌లో గ్రాండ్ లెవల్లో నిర్వహించిన ఈ ప్రమోషనల్ షోకు ఆడియెన్స్ నుండి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది.
After a successful US tour, Akhil is set to perform in Hyderabad on the 20th
Akhil Akkineni along with Rana Daggubati, leading lady Kalyani Priyadarshan, and music director Anup Rubens, thrilled the audience by putting up a one-of-a-kind promotional tour in the USA over the last week. The HELLO! Team, who travelled to New Jersey, Dallas and San Jose, were greeted by thousands of fans who showered them with love and adulation.
Unlike any traditional promotional event, the HELLO! USA tour was a spectacular show to remember, complete with singing, dancing and a whole lot of fun interactions between the audience and the actors. Fans thronged to watch Akhil perform live in concert as he serenaded them with songs from the movies, while also showing off some energetic dance performances along with the whole team. Rana, who hosted the show, ensured that everyone’s energy levels were high and upbeat. There was also meet and greet event organised, much to the delight of all those who got to meet the stars in person.
Overall, the event was a housefull affair at all three venues and was a great success, with #HELLOUSA creating quite the buzz on social media among fans. Now, the HELLO! Team is all set to bring the show to Hyderabad on December 20th, two days before the movie’s release. The grand event, Hello – Sing & Dance Together with Akhil, will take place at N Convention in Madhapur, where he will perform for his fans. ChiranjeeviGaru will grace the function as the chief guest to give Akhil his blessings for HELLO!
With just days left for the release, excitement has reached peak level for Tollywood fans, who are waiting to say HELLO! to the movie on December 22.