అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియకి ‘గూడచారి’ హీరో అడివి శేష్ కి పెళ్లి కాబోతుందనే వార్తలు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంలో డేటింగ్ చేస్తోన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతుందని సమాచారం.ఇటీవల ‘గూడచారి’ చిత్రం లో వీరిద్దరూ కలిసి నటించారు.అప్పటినుంచి వారి మధ్య ప్రేమ మొదలయ్యిందట.యువ హీరో సుమంత్ కి సుప్రియ సోదరి. సుప్రియకు గతంలో పెళ్లి జరిగినా ఆ తర్వాత వారు విడిపోయారు.
ఇటీవల అడివి శేష్ కూడా త్వరలోనే పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అప్పుడు కూడా నెటిజన్లు పెళ్లి వార్త చెప్పబోతున్నావా..? అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో నిజంగానే అడివి శేష్ పెళ్లి వార్తలు వెలుగులోకి వచ్చాయి.
సుప్రియతో అడివి శేష్ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా రాబోతుందని సమాచారం. అన్నీ కుదిరితే డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.ఆ వ్యవహారాలన్నీ తానే దగ్గరుండి చూసుకుంటానని అక్కినేని కోడలు సమంత చెబుతోందట. సుప్రియ తొలిసారి పవన్ కళ్యాణ్ తో ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’లో నటించిన విషయం తెలిసిందే.