నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) కొద్ది సేపటి క్రితం చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2018 లో న్యూరోఎండోక్రిన్ ట్యూమర్‌తో బాధపడ్డ ఆయన లండన్‌లో చికిత్స పొందారు. కోలుకున్న తర్వాత ఇండియాకి వచ్చారు. అయితే మంగళవారం ఇర్ఫాన్ అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు.
ఇర్ఫాన్ తల్లి సైదా బేగం ఎప్రిల్ 25 ఉదయం కన్ను మూసింది. లాక్డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు. తల్లి చనిపోయి కొద్ది రోజులు కూడా కాకముందే ఇర్ఫాన్ ఇలా ఆకస్మాత్తుగా కన్నుమూయడంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. ఇర్ఫాన్‌కు భార్య సుతాపా సిక్దార్, ఇద్దరు కుమారులు ఉన్నారు.
హాలీవుడ్ ఉత్తమ చిత్రాల్లోనూ…
ఇర్ఫాన్ చివరిగా ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు.ఇర్ఫాన్ ఖాన్ ‘పాన్ సింగ్ తోమర్’ సినిమాకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. ఇర్ఫాన్ తన నటనతో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కాలు అందుకున్నారు.తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు ‘సైనికుడు’ లో నటించారు .ఇర్ఫాన్ బాలీవుడ్ సినిమాలే కాకుండా ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘ఎ మైటీ హార్ట్’, ‘జురాసిక్ వరల్డ్’, ‘లైఫ్ ఆఫ్ పై’ వంటి హాలీవుడ్ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు.
Official statement on Irrfan Khan’s passing away
“i trust, i have surrendered”; These were the some of the many words that Irrfan expressed in a heart felt note he wrote in 2018 opening up about his fight with cancer. And a man of few words and an actor of silent expressions with his deep eyes and his memorable actions on screen. It’s saddening that this day, we have to bring forward the news of him passing away. Irrfan was a strong soul, someone who fought till the very end and always inspired everyone who came close to him. After having been struck by lightning in 2018 with the news of a rare cancer, he took life soon after as it came and he fought the many battles that came with it. Surrounded by his love, his family for whom he most cared about, he left for heaven abode, leaving behind truly a legacy of his own. We all pray and hope that he is at peace. And to resonate and part with his words he had said, “As if I was tasting life for the first time, the magical side of it”.